Skip to main content

Navodaya Admissions 2025-26: ఆన్‌లైన్‌లో నవోదయ దరఖాస్తుల స్వీకరణ

2025– 26 విద్యాసంవత్సరం ఆరో తరగతిలో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్ష కోసం అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా సెప్టెంబ‌ర్ 23‌ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Navodaya JNVST Class 6 Admission news in telugu  Class VI entrance test 2025-26 online application deadline September 23  Eligible candidates apply online for Class VI admission test 2025  Admission test 2025-26 for Class VI, online application till September 23 Class VI academic year 2025-26 entrance exam application deadline

అభ్యర్థి ఉమ్మడి మెదక్‌ జిల్లా(సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట)లో 2024–25 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ తరగతి చదువుతూ ఉండాలి. ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 3, 4 తరగతులు పూర్తి విద్యాసంవత్సరం చదివి, ఉత్తీర్ణులై ఉండాలి. 2013, మే ఒకటో తేదీ నుంచి 2015 జూలై 31 మధ్య (రెండు దినములు కలుపుకొని) జన్మించి ఉండాలి. జనవరి 18న ప్రవేశ పరీక్ష జరుగుతుంది. http://navodaya.gov.in వెబ్‌సైట్‌ సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 
– రాజేందర్‌, నవోదయ ప్రిన్సిపాల్‌

చదవండి: Navodaya Admissions : న‌వోదయ ప్ర‌వేశ ప‌రీక్ష‌లో ఈ విద్యార్థుల ప్ర‌భంజ‌నం..!

దూరమనే బాధ లేదు

నేను హర్యాన రాష్ట్రం హిస్సార్‌ జిల్లా నవోదయ విద్యార్థిని. మైగ్రేషన్‌ విధానంలో భాగంగా నాతోపాటు 21 మంది విద్యార్థులం వర్గల్‌ నవోదయలో చదువుకుంటున్నాం. ఇరవై నాలుగు గంటల రైలు ప్రయాణం, న్యూఢిల్లీ ఆవల 1,500 కిలోమీటర్లు పైగా దూరం నుంచి వచ్చినప్పటికీ మాకు దూరమనే భావన, బాధలేదు. మా భోజన అలవాట్లకు అనుగుణంగా ఇక్కడ చపాతి ఇస్తున్నారు. ఇక్కడి సంస్కృతి కొత్త అనుభూతి పంచుతుంది. మేము ఉండే సంవత్సర కాలంలో తెలుగు పదాలను నేర్చుకునే ప్రయత్నం చేస్తాం.

మేఘ, హర్యాన రాష్ట్రం

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 24 Sep 2024 09:59AM

Photo Stories