Skip to main content

10th Class Exam Pattern: ఈ ఏడాదికి టెన్త్‌లో ఇంటర్నల్‌ మార్కులు

సాక్షి, హైదరాబాద్‌: పదో తరగతి పరీక్షల విధానంలో మార్పులు చేసిన ప్రభుత్వం... మళ్లీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.
TG Govt Takes Back 10th Internal Marks Decision for This Year news in telugu

ఇప్పటివరకు ఇస్తున్న 20 ఇంటర్నల్‌ మార్కులు ఎత్తేస్తూ వంద మార్కులకు టెన్త్‌ పేపర్‌ ఉంటుందని న‌వంబ‌ర్‌ 28న ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ ఆదేశాలను సవరిస్తూ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఏడాది వరకు పాత పద్ధతినే కొనసాగిస్తామని తెలిపింది.

చదవండి: ఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2025 | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్

2025–26 విద్యాసంవత్సరం నుంచి మారి న విధానం అమలు చేస్తామని స్పష్టం చేసింది. అంటే ఎప్పటిలాగే ఈసారి కూడా 20 ఇంటర్నల్‌ మార్కులు ఇస్తారు. టెన్త్‌ పేపర్‌ సైతం ఈసారికి 80 మార్కులకు ఉంటుంది. ఈ రెండు ఉత్తర్వులను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. అన్ని పాఠశాలల్లో ఇప్పటికే ఫార్మెటివ్, సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌ పరీక్షలు జరిగాయి.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

పరీక్షల విధానంలో మార్పులుంటే విద్యా సంవత్సరం ముందే చెప్పాలని... పరీక్షలు 2 నెలలు ఉండగా ఇప్పుడు మార్పులు చేయడం ఏమిటని విద్యా ర్థులు, ఉపాధ్యాయులు ప్రభుత్వ విధానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం కూడా అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఉత్తర్వులను సవరించినట్లు అధికారుల్లో చర్చ జరుగుతోంది.

 

Published date : 30 Nov 2024 11:29AM

Photo Stories