Skip to main content

TET Exam Guidelines: టీజీ టెట్‌ పరీక్ష రాసే అభ్య‌ర్థుల‌కు ప‌లు సూచనలు.. సందేహాలకు ఈ నంబర్లని సంప్రదించొచ్చు..

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీజీ టెట్‌)లు జ‌న‌వ‌రి 2 నుంచి 20వ తేదీ వరకు విడతలవారీగా జరగను న్నాయి.
TET Exam Guidelines

కంప్యూటర్‌ ఆధారితంగా జరిగే ఈ పరీక్షలను మొత్తం 10 రోజులపాటు 20 సెషన్స్‌లో నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 11:30 గంటల వరకు ఒక సెషన్‌.. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 గంటల వరకు రెండో సెషన్‌ జరగనుంది. ఇందుకోసం 17 జిల్లాల్లో 92 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పాఠశాల విద్య డైరెక్టరేట్‌ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

చదవండి: TG టెట్‌ - TG డీఎస్సీ | సిలబస్ | బిట్ బ్యాంక్ | ప్రిపరేషన్ గైడెన్స్ | మోడల్ పేపర్స్ | TG TET ప్రివియస్‌ పేపర్స్

పేపర్‌–1కు 94,327 మంది, పేపర్‌–2కు 1,81,426 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షలు సజావుగా సాగేలా ఏర్పాట్లు పూర్తిచేసినట్లు పాఠశాల విద్య కమిషనర్‌ ఇ.నర్సింహారెడ్డి పేర్కొ న్నారు. ఉదయం సెషన్‌ పరీక్ష రాసే అభ్యర్థులు ఉదయం 7:30 గంటలకల్లా, మధ్యాహ్నం సెషన్‌ అభ్యర్థులు మధ్యాహ్నం 12:30 గంటలకల్లా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

అభ్యర్థులను ఉదయం 8:30 తర్వాత, మధ్యాహ్నం 1:30 తర్వాత పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. టెట్‌పై సందేహాలకు 7032901383, 9000756178, 7075028882, 7075028885 నంబర్లకు సంప్రదించొచ్చని సూచించారు.  

Published date : 02 Jan 2025 10:59AM

Photo Stories