Skip to main content

TS TET Result 2025 : రేపే టీఎస్ టెట్ ఫ‌లితాలు విడుద‌ల‌.. అలాగే డీఎస్సీ నోటిఫికేష‌న్ కూడా...

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) ప‌రీక్ష ఫ‌లితాల‌ను ఫిబ్ర‌వ‌రి 5వ తేదీన విడుద‌ల చేయ‌నున్నారు. ఈ మేర‌కు తెలంగాణ విద్యాశాఖ ఏర్పాట్ల‌ను పూర్తి చేసింది.
Telangana Teacher Eligibility Test (TET) results release announcement  Telangana Education Department announces TET exam results  ts tet 2025 result release date and ts dsc 2025 notification release date

ఈ ఫలితాలను అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://tgtet2024.aptonline.in/tgtet లో చూడొచ్చు. ఫైనల్ కీని కూడా ఫలితాలతో పాటు విడుదల చేయ‌నున్నారు.ఇప్పటికే టీఎస్ టెట్-2025 ప్రిలిమినరీ ఆన్సర్‌ కీ విడుదల చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ టెట్‌ను 2025 జనవరి 2వ తేదీ నుంచి జనవరి 20వ తేదీ వరకు నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 2,05,278 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

6000 టీచర్‌ పోస్టులు భర్తీకి..
తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్‌ 2025 ఫిబ్రవరిలో విడుదల చేసే అవ‌కాశం ఉంది. ఇక ఈ డీఎస్సీకి ఏప్రిల్‌లో పరీక్షలు జ‌రిగే అవ‌కాశం ఉంది. అయితే ఎస్సీ వర్గీకరణ అంశం తెరమీదకు రావడంతో.. ఏప్రిల్‌ నెలలో ఈ డీఎస్సీ 2025 నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం ఉంది. ఈసారి డీఎస్సీలో సుమారు దాదాపు 6000 టీచర్‌ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది.

Published date : 04 Feb 2025 03:42PM

Photo Stories