Skip to main content

DEO Ramesh Kumar: విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి.. ప్రతి ఉపాధ్యాయుడు 5 అంశాలు

తెలకపల్లి: ప్రభుత్వ పాఠశాలలో కృత్యాధార విధానం ద్వారా ఉపాధ్యాయులంతా తరగతి బోధన చేసి విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని డీఈఓ రమేష్‌కుమార్‌ అన్నారు.
Strive for holistic development of students

డిసెంబ‌ర్ 30న‌ మండలంలోని రాకొండ కేజీబీవీ, తెలకపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి ఆంగ్ల మాధ్యమంలో ఉపాధ్యాయుల బోధన, ప్రక్రియను విద్యార్థులతో కలిసి కూర్చొని పాఠ్యాంశాలు విన్నారు.

కేజీబీవీ విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం ఉపాధ్యాయుల బోధన, పద్ధతులను పరిశీలించారు. ప్రతి ఉపాధ్యాయుడు 5 అంశాలను దృష్టిలో పెట్టుకొని విద్యార్థుల పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలన్నారు.

చదవండి: JK Bank Recruitment: జమ్మూకశ్మీర్‌ బ్యాంక్‌లో 278 అప్రెంటిస్‌లు.. నెలకు రూ.10,500 జీతం..

ఉపాధ్యాయుల కృషితోనే ప్రభుత్వ పాఠశాలల విద్యా బలోపేతం అవుతుందన్నారు. పట్టుదలతో పనిచేస్తే పాఠశాల స్థాయి మరింత ఉన్నతంగా మారుతుందని, తద్వారా రాబోయే తరం నాణ్యమైన సమాజాన్ని నిర్మిస్తుందన్నారు. రానున్న పదో తరగతి పరీక్ష ఫలితాలలో జిల్లాను రాష్ట్రస్థాయిలో ఉత్తమ స్థానంలో నిలిపాలని సూచించారు. ఉపాధ్యాయుల హాజరుపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, సెలవుపై వెళ్తున్న వారు ముందస్తుగా అనుమతి తీసుకోవాలన్నారు. కేజీబీవీల పర్యవేక్షణాధికారి శోభారాణి, ఎంఈఓ శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
 

Published date : 31 Dec 2024 09:38AM

Photo Stories