Skip to main content

Free Coaching: గ్రామీణ నిరుద్యోగులకు ఉచిత శిక్షణ.. హాస్టల్, భోజనంతో కూడిన శిక్షణ..

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని గ్రామీణ నిరుద్యోగ యువతీయువకులకు హాస్టల్, భోజనంతో కూడిన ఉచిత శిక్షణ.. అనంతరం ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన దిశగా స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థ చర్యలు చేపడుతోంది.
Free training for rural unemployed   Swami Ramananda Tirtha Rural Organization training rural youth with hostel and meals  Free training and job opportunities for unemployed rural youth in TelanganaRural youth receiving training and support for employment in Telangana

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని ఈ సంస్థ ద్వారా ఉపాధి ఆధారిత సాంకేతిక శిక్షణా కార్యక్రమాలకు అర్హత, ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. బీకాం పాసైన వారికి మూడున్నర నెలల అకౌంట్స్‌ అసిస్టెంట్‌ (ట్యాలీ), ఇంటర్‌ పాసైన వారికి మూడున్నర నెలలపాటు బేసిక్‌ కంప్యూటర్స్‌ (డేటాఎంట్రీ ఆపరేటర్‌), ఇంటర్‌ అర్హతతో మూడున్నర నెలల కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ అసిస్టెంట్, పదో తరగతి పాసైన వారికి మూడున్నర నెలల ఆటోమొబైల్‌–టూవీలర్‌ సర్వీసింగ్, నాలుగు నెలల సెల్‌ఫోన్, ఎలక్ట్రానిక్‌ వస్తువుల రిపేర్, పది పాసైన/ఐటీఐ ఉత్తీర్ణులైనవారికి ప్రాధాన్యత కల్పిస్తూ ఐదునెలల ఎలక్ట్రీషియన్‌ (డొమెస్టిక్‌), నాలుగు నెలల సోలార్‌ సిస్టమ్‌ ఇన్‌స్టలేషన్, సర్వీస్‌లలో శిక్షణను ఇవ్వనున్నారు.

చదవండి: Free Coaching: నిరుద్యోగులకు ఉచిత శిక్షణ.. ఉద్యోగ అవకాశం కూడా..

వీరిలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థిని, విద్యార్థులకు ప్రాధాన్యతనివ్వనున్నారు. గురువారం (జనవరి 2న) యాదాద్రి జిల్లా భూదాన్‌ పోచంపల్లి మండలంలోని జలాల్‌పూర్‌లోని ఈ సంస్థలో... గ్రామీణ యువతీయువకులు (18–30 ఏళ్ల మధ్యలోని వారు), తమ అర్హతల ఒరిజినల్‌ సర్టిఫికెట్స్, జిరాక్స్‌ సెట్‌తో, పాస్‌పోర్ట్‌ సైజు ఫొటో, ఆధార్‌కార్డ్, రేషన్‌కార్డ్‌లతో హాజరుకావాల్సి ఉంటుంది. డిసెంబ‌ర్ 31న‌ ఈ మేరకు ఈ సంస్థ డైరెక్టర్‌ పీఎస్‌ఎస్‌ఆర్‌ లక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. ఇతర వివరాలను 9133908000, 9133908111, 9133908222, 9948466111 నంబర్ల ద్వారా తెలుసుకోవచ్చునని సూచించారు.  

Published date : 02 Jan 2025 11:32AM

Photo Stories