Skip to main content

Largest Classroom: దేశంలోనే విశాలమైన తరగతి గది ఇక్క‌డ‌

ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో దేశంలో ఎక్కడాలేని విధంగా 500 కుర్చీలతో విశాలమైన తరగతి గదిని నిర్మించారు.
OU has the largest classroom in the country

క్యాంపస్‌లోని సైన్స్‌ విభాగాల సెక్టార్‌లో నిరుపయోగంగా ఉన్న పాత భవనాన్ని గత వీసీ ప్రొఫెసర్‌ రవీందర్‌ మరమ్మతులు చేయించి తరగతి గదిగా నిర్మించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఒకేసారి 500 మంది విద్యార్థులు కూర్చుని పాఠాలు వినేలా ఈ గదిని ఏర్పాటు చేశారు. ఓయూ విద్యార్థులను ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నత ఉద్యోగాలకు ఎంపిక చేసే లక్ష్యంతో సివిల్‌ సర్వీస్‌ అకాడమీని స్థాపించారు.

యూపీఎస్సీ సివిల్స్‌ ఉద్యోగాలపై ఆసక్తిగల అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేసి ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఓయూ క్యాంపస్‌లోని వివిధ కాలేజీలతో పాటు యూనివర్సిటీ అనుబంధ నిజాం, సైఫాబాద్, సికింద్రాబాద్‌ పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులకు నిష్ణాతులైన బోధకులతో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు.  

చదవండి: PhD Admissions: ఓయూలో పీహెచ్‌డీ ప్రవేశానికి దరఖాస్తులు

7 నుంచి తరగతులు ప్రారంభం 

ఓయూ సివిల్‌ సర్వీస్‌ అకాడమీలో 2025 జనవరి 7 నుంచి విద్యార్థులకు తరగతులు ప్రారంభమవుతాయని డైరెక్టర్‌ ప్రొ.కొండ నాగేశ్వర్‌రావు డిసెంబ‌ర్ 30న‌ తెలిపారు. వచ్చే సంవత్సరం సివిల్‌ సర్వీస్‌ ప్రిలిమ్స్‌ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేసినట్లు చెప్పారు. మొదటి బ్యాచ్‌ తరగతులకు 200 మంది విద్యార్థులు ఎంపికైనట్లు ఆయన తెలిపారు.  

Published date : 31 Dec 2024 03:56PM

Photo Stories