Highly Paid Medical Courses: 10వ తరగతి పాస్ అయితే చాలు.. ఈ మెడికల్ కోర్సులు చేస్తే భారీ జీతాలు
1. డీఎంఎల్‌టీ (డిప్లొమా ఇన్ మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీ)
మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సు రెండు సంవత్సరాలు ఉంటుంది. ఇందులో ల్యాబ్ టెస్టులు, రోగ నిర్ధారణ, రిపోర్టు ప్రిపరేషన్ మొదలైనవి నేర్పిస్తారు. ఆరోగ్య సంరక్షణ రంగానికి చెందిన ఈ కోర్సు చేసిన వారికి మంచి డిమాండ్ ఉంది. అధిక జీతం కూడా అందుకోవచ్చు.
2. రేడియాలజీ టెక్నాలజీ కోర్సు
ఈ కోర్సులో చేరినవారికి ఎక్స్-రే, అల్ట్రాసౌండ్ యంత్రాలను ఆపరేట్ చేయడం నేర్పుతారు. 10వ తరగతి తర్వాత రెండు సంవత్సరాల ఈ డిప్లొమా కోర్సు చేయవచ్చు. కోర్సు పూర్తయ్యాక రూ.30,000 నుంచి రూ.50,000 వరకు ప్రారంభ వేతనం పొందవచ్చు.
3. డిప్లొమా ఇన్ ఫార్మసీ (D.Pharm)
ఈ రెండు సంవత్సరాల కోర్సులో ఔషధాలు, వాటి విక్రయాల గురించిన సమాచారాన్ని బోధిస్తారు. ఈ కోర్సు పూర్తి చేసినవారు మెడికల్ స్టోర్ ప్రారంభించవచ్చు. లేదా ఫార్మాస్యూటికల్ కంపెనీలలో పని చేయవచ్చు.
Tomorrow Job Mela: పదో తరగతి పాసైతే చాలు.. రేపే జాబ్‌మేళా, పూర్తి వివరాలివే!
4. ఆప్టోమెట్రీలో డిప్లొమా
ఈ కోర్సులో కంటి సంబంధిత వ్యాధుల చికిత్స, దృష్టిని మెరుగుపరచడానికి అవసరమైన శిక్షణను అందిస్తారు. ప్రారంభ వేతనం రూ. 25,000 నుంచి రూ. 40,000 వరకు ఉంటుంది.
5. ANM/GNM (నర్సింగ్ కోర్సు)
రెండు సంవత్సరాల పాటు ఉండే ఈ కోర్సులో ప్రాథమిక నర్సింగ్ నైపుణ్యాలను బోధిస్తారు. నర్సింగ్ ఫీల్డ్‌ను కెరీర్‌గా ఎంచుకోవడం ద్వారా మంచి ఆదాయం అందుకోవచ్చు.
6. డెంటల్ హైజీనిస్ట్ కోర్సు
ఈ కోర్సులో దంతాల శుభ్రత, వ్యాధులను గుర్తించడం మొదలైనవి నేర్పిస్తారు. ఇది రెండు సంవత్సరాల కోర్సు. ప్రారంభ వేతనం రూ. 25,000 నుంచి మొదలవుతుంది
32000 Jobs: ఆర్‌ఆర్‌బీలో 32,000 గ్రూప్–డి పోస్టులు.. నెలకు రూ.18,000 జీతం..
7. డిప్లొమా ఇన్ ఫిజియోథెరపీ (DPT)
ఈ రెండు సంవత్సరాల కోర్సులో శారీరక రుగ్మతలను నయం చేసే పద్ధతులు నేర్పుతారు. ఈ కోర్సు పూర్తి చేశాక క్లినిక్ తెరవడం లేదా ఆసుపత్రిలో పని చేయడం ద్వారా మంచి ఆదాయాన్ని అందుకోవచ్చు.
8. హోమియోపతి అసిస్టెంట్ కోర్సు
ఈ కోర్సు రెండు సంవత్సరాల పాటు ఉంటుంది. దీనిలో హోమియోపతి మందులు, చికిత్సకు సంబంధించిన శిక్షణను అందిస్తారు. దీనిని పూర్తి చేసిన తర్వాత, సొంతంగా ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది.
9. సర్జికల్ అసిస్టెంట్ కోర్సు
శస్త్రచికిత్స సమయంలో వైద్యునికి సహాయం చేయడానికి ఈ కోర్సు ద్వారా శిక్షణనిస్తారు. ఈ కోర్సు రెండు సంవత్సరాలు ఉంటుంది. ఈ కోర్సుకు అత్యధిక డిమాండ్ ఉంది.
DRDO Recruitment 2025: డీఆర్‌డీవోలో జూనియర్ రీసెర్చ్ ఫెలోల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..
10. అంబులెన్స్ అసిస్టెంట్ కోర్సు
అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌ను నడపడానికి, ప్రథమ చికిత్స అందించడంపై శిక్షణనిస్తారు. ప్రారంభ వేతనం రూ.20,000 నుండి రూ.30,000 వరకు ఉంటుంది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Medical courses
- Medical Courses after 10th
- highly paid medical courses
- Radiology Technicians
- Pharmacy Diploma
- nursing courses
- Medical career opportunities
- Well-Paid Medical Jobs
- Job-Oriented Medical Courses
- medical courses latest news
- medical courses which pays high salary
- Healthcare career
- Career in medicine without MBBS
- Medical diploma programs
- Medical education alternatives
- Short-term courses
- Affordable medical jobs