Skip to main content

Medical Courses Admissions : ఎంబీబీఎస్‌, బీడీఎస్, బీఎస్సీ ప్ర‌వేశాల‌కు మ‌రో అవ‌కాశం.. ఎలా అంటే...?

ఎంబీబీఎస్‌, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్‌లలో వంటి వైద్య విద్య కోర్సుల్లో ప్ర‌వేశం పొందేందుకు నిర్వ‌హించే ప‌రీక్ష నీట్‌.
Special stray vacancy round 3 schedule for neet ug 2024 counselling   NEET exam for medical courses like MBBS, BDS, and BSC Nursing  All India Quota and State Quota counseling for NEET candidates

సాక్షి ఎడ్యుకేష‌న్: ఎంబీబీఎస్‌, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్‌లలో వంటి వైద్య విద్య కోర్సుల్లో ప్ర‌వేశం పొందేందుకు నిర్వ‌హించే ప‌రీక్ష నీట్‌.. ఈ కోర్సుల్లో ఖాళీగా ఉన్న ఆల్ ఇండియా కోటా (AIQ), స్టేట్ కోటా సీట్లను భర్తీ చేసేందుకు నేష‌నల్ ఎలిజిబిలిటీ ఎట్రెన్స్ టెస్ట్ (నీట్‌) నిర్వ‌హించి, ప‌రీక్ష‌లో నెగ్గిన వారికి ఈ కౌన్సెలింగ్ ప్ర‌క్రియ ఉంటుంది.

BDS Admissions: బీడీఎస్‌ కన్వినర్‌ సీట్లకు వెబ్‌ కౌన్సెలింగ్‌.. వెబ్‌ ఆప్షన్లు నమోదుకు చివ‌రి తేదీ ఇదే..

దీనిని మెడిక‌ల్ కౌన్సెలింగ్ క‌మిటి (ఎంసీసీ) నిర్వ‌హిస్తారు. అయితే, దీనికి సంబంధించిన షెడ్యూల్ ను ఇటీవ‌లె ప్రారంభం అయ్యింది. ఈ కౌన్సెలింగ్‌ను నీట్ యూజీ 2024 ప్ర‌వేశాల‌కు నిర్వ‌హిస్తున్నారు.

స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ 3..

అధికారిక కౌన్సెలింగ్‌ షెడ్యూల్ ప్రకారం.. నీట్ యూజీ 2024 స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ 3 ఆప్షన్ పూర్తి చేసే ప్రక్రియ డిసెంబర్ 23.. అంటే, నేడు ఉదయం 11 గంటలకు ప్రారంభ‌మైంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఆప్షన్ నింపే విండోను యాక్సెస్ చేయవచ్చు.

NEET TG Medical Counselling: నాలుగైదు రోజుల్లో మెడికల్‌ కౌన్సెలింగ్‌!.. రాష్ట్రస్థాయి మెరిట్‌ లిస్ట్‌ విడుదల!

లాక్ ఆప్షన్ల గడువు డిసెంబర్ 24 అంటే.. రేపు ఉదయం 11 గంటలకు వస్తుంది. ఛాయిస్-ఫిల్లింగ్ పోర్టల్‌ను యాక్సెస్ చేసేందుకు ద‌రఖాస్తులు చేసే అభ్య‌ర్థులు తప్పనిసరిగా వారి నీట్ యూజీ రోల్ నంబర్, పాస్‌వర్డ్, సెక్యూరిటీ పిన్‌ని న‌మోదు చేయాల్సి ఉంటుంది. వారి ర్యాంక్, ప్రాధాన్యతలు, రిజర్వేషన్ విధానాలు, సీట్ల లభ్యత ఆధారంగా సీట్ల కేటాయింపులు జరుగుతాయి.

సీట్ల కేటాయింపు ప్రక్రియ: ఎంసీసీ సీట్ల కేటాయింపు ప్రక్రియను రేపు అంటే, డిసెంబర్ 24న ప్రారంభిస్తుంది. అదే రోజు ఫలితాలు ప్రకటించనున్నారు.
అసైన్డ్ కాలేజీకి రిపోర్టింగ్: డిసెంబరు 30 సాయంత్రం 5 గంటలకు ఫైనల్ రిపోర్టింగ్ గడువుతో డిసెంబరు 26 నుంచి తమకు కేటాయించిన కాలేజీలకు రిపోర్ట్ చేయాలి.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

ఎంసీసీ నీట్ యూజీ 2024 కౌన్సెలింగ్: డాక్యుమెంట్లు అవసరం, కౌన్సెలింగ్ ప్రక్రియలో ధృవీకరణకు దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఈ కింది డాక్యుమెంట్లను కలిగి ఉండాలి.

అడ్మిట్ కార్డ్‌కు న‌మోదు వివ‌రాలు:

నీట్ యూజీ 2024 స్కోర్‌కార్డ్
10వ తరగతి సర్టిఫికేట్, మార్క్ షీట్ (పుట్టిన తేదీ)
క్లాస్ 12 సర్టిఫికేట్, మార్క్ షీట్
వ్యాలిడీటీ అయ్యే ఐడీ ప్రూఫ్
8 పాస్‌పోర్ట్ సైజు ఫొటోగ్రాఫ్స్
NEET UG Counselling 2024: నీట్‌ అభ్యర్థులకు అలర్ట్‌.. దరఖాస్తు తేదీ పొడిగింపు, ఫలితాలు ఎప్పుడంటే..
ప్రొవిజనల్ అలాట్‌మెంట్ లెటర్
కుల ధృవీకరణ పత్రం (వర్తిస్తే)
పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ (వర్తిస్తే)
ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ (వర్తిస్తే)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 24 Dec 2024 10:28AM

Photo Stories