NEET UG Ranker Prerna : నీట్ ర్యాంకర్ ప్రేరణ.. తొలి ప్రయత్నంలోనే ఏఐఆర్ 1,033.. తండ్రి స్పూర్తితోనే..

సాక్షి ఎడ్యుకేషన్: పోటీ పరీక్షల్లో క్లిష్టమైనది, కష్టమైనదాంట్లో ఒకటి నీట్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. ఈ పరీక్షలో నెగ్గడం అంత సులువు కాదు. దీనిని, ఎన్‌టీఏ ఏటా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు ఎంపిక పరీక్షగా నిర్వహిస్తుంది. వేలల్లో, లక్షల్లో విద్యార్థులు ప్రయత్నాలు చేస్తే, అందులో సగం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించి ముందుకు వెళ్తారు. ఆ కొద్ది మందిలో ఒకరే ఈ యువతి కూడా. ఎన్నో కష్టాలను ఎదురుకొని, తన పరీక్షకు సిద్ధమై అన్నింటిలో కల్లా కష్టమైన పరీక్షగా పేరొందిన నీట్‌కు ప్రిపేర్ అయ్యి 2023లో నిర్వహించిన నీట్ యూజీ పరీక్షలో నేషనల్ లెవెల్‌లో 1,033 ర్యాంకును సాధించారు.
తీవ్ర విషాదం.. ఆర్థిక పరిస్థితులు..
రాజస్థాన్‌కు చెందిన ప్రేరణా సింగ్.. ఆటో రిక్షా డ్రైవర్ కుమార్తె. తన మొదటి ప్రయత్నంలోనే నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి తన కుటుంబాన్ని గర్వపడేలా చేసింది. తను నీట్‌కు ప్రిపేర్ అవ్వాలని, గెలవాలనే ఆశయం తనకు 2018లో ప్రారంభమైంది. తన కుటుంబంలో జరిగిన ఒక తీవ్ర విషాదం తర్వాత తాను తన కెరీర్‌లో ఎలాగైన ముందుకెళ్లి కుటుంబానికి సాయంగా నిలవాలని నిర్ణయించుకుంది.
UPSC Sisters Success Story : వ్యవసాయ కుటుంబం నుంచి ఒకరు ఐఏఎస్, మరొకరు ఐపీఎస్!!
2018లో ప్రేరణ తన ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న సమయంలో తన తండ్రి కన్నుమూసారు. దీంతో, ఆ కుటుంబం ఆర్థికంగా వెనకపడిపోయింది. చేసిన 27 లక్షల రూపాయల అప్పును తీర్చాలని, తనకు ఉన్న నలుగురు తోబుట్టువులు ఉండగా వారిని చదివించేందుకు, ఇల్లు గడిచేందుకు చాలా కష్టపడింది. ఈ నేపథ్యంలోనే తన ఇంటర్ ముగిసిన వెంటనే నీట్‌కు సిద్ధమవ్వడం ప్రారంభించింది. తనకు ఉన్న ఆశయాలను ఎలాగైనా చేరుకోవాలని గట్టిగానే పోటీ పడింది.
10 నుంచి 12 గంటల చదువు..
ఎన్ని కష్టాలొచ్చినా వెనక్కి తిరగకుండా పట్టుదలతో చదివింది ప్రేరణ. ప్రతీ రోజు 10 నుంచి 12 గంటల సమయం కేవలం తన ప్రిపరేషన్‌కే కేటాయించేంది. వారంతా ఉండే ఇంట్లో ఉన్న ఒక్క గది పడుకునేందుకు కూడా స్థలం లేక కేవలం కూర్చునే స్థలంలో తన ప్రిపరేషన్‌ను సాగించేది. వారి తల్లి పేరున వచ్చే 500 రూపాయల పెన్షన్‌తోనే జీవనాన్ని గడిపేవారు. తన నీట్ కోచింగ్ కోసం తన బంధువులు కూడా ఎంతో కొంత ఆర్థికంగా సహాయపడ్డారు. ఇక, ఒంటి పూట తినడం, కోచింగ్ కోసం నడక ప్రయాణం చేయడం చిన్న చిన్న ఉద్యోగాలు చేయడం వంటివి తనను ఇంత దూరం నడిపించింది. తాను పడ్డ ప్రతీ కష్టానికి ఫలితమే ఈ నీట్ పరీక్షలో సాధించిన ర్యాంక్.
ఏఐఆర్ 1,033 ర్యాంకు..
ప్రేరణ పడ్డ సంవత్సరాల కష్టాలు, తాను పడ్డ ఇబ్బందుల తర్వాత, ప్రేరణ తన నీట్ యూజీ 2023 పరీక్షలో తాను తొలి ప్రయత్నం చేసింది. ఇక, తన మొదటి ప్రయత్నంలోనే ఫలితం కూడా దక్కింది. ఉత్తీర్ణతతోపాటు, అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఆ అదృష్టం తన తొలి ప్రయత్నంలోనే గెలుపు దక్కడం.
నీట్ పరీక్షతో, వైద్య విద్య కోర్సులో అర్హత సాధించిన 2.5 లక్షల మంది విద్యార్థులలో, ఆమె 720కి 686 మార్కులు సాధించడం చాలా గర్వకారణం. ఈ స్కోర్‌తో తాను ఏకంగా 1,033 ఆల్ ఇండియా ర్యాంక్ (AIR)ను సాధించింది.
తండ్రి ప్రేరణతోనే..
ఈ విషయంపై ప్రేరణ మాట్లాడుతూ, ఎవ్వరు కూడా వారు కనే కలలను ఎప్పటికీ వదులుకోవద్దని, ఈ పాఠాన్ని తనకు నేర్పించిన తన తండ్రికి కృతజ్ఞతలు చెబుతూ.. తనకు గొప్ప ప్రేరణ అని ప్రేరణ సింగ్ చెప్పుకొచ్చారు.
నిరంతర తనఖా చెల్లింపులు మాత్రమే కాకుండా, ఇతర ఆర్థిక సవాళ్లతో సహా తన కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను కూడా ఆమె ప్రతిబింబించింది. తన ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత తన విద్యను కొనసాగించాలనే తన ఆశయాన్ని మాత్రమే కాదు, భవిష్యత్తులో వైద్య పరిశోధనలకు తోడ్పడాలనే తన కోరికను ప్రేరణ వ్యక్తం చేసింది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- neet ug ranker
- rankers success story
- neet ug rankers 2023
- auto rickshaw driver daughter success story
- neet ug rankers 2023 success story
- prerna singh success story
- prerna singh success in neet
- neet first attempt success
- prerna singh success in neet 2023
- success journey of prerna singh in neet 2023
- NEET Rankers 2023
- success stories of neet ug rankers
- medical courses admission test rankers
- all india rankers in neet ug 2023
- rankers of neet ug 2023
- latest success stories of neet rankers
- Education News
- Sakshi Education News