Skip to main content

Mega DSC Applications Confusion : తిక‌మక పెడుతున్న‌ డీఎస్సీ ద‌ర‌ఖాస్తులు.. అయోమ‌యంలో అభ్య‌ర్థులు..

ఇటీవ‌ల ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌లైంది. అభ్య‌ర్థులు త‌మ ద‌ర‌ఖాస్తుల‌ను కూడా ప్రారంభించుకోవ‌చ్చ‌ని వెల్ల‌డించారు అధికారులు. కాని, ఇక్క‌డే అభ్య‌ర్థుల‌కు చిక్కులు ఎదుర‌వుతున్నాయి. వీటితో, తిక‌మ‌క‌ప‌డుతున్నారు.
Confusion in ap mega dsc applications

తిరుపతి సిటీ: ప్రభుత్వం విడుదల చేసిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ వివాదాలకు తావిస్తోంది. డీఎస్సీకి దరఖాస్తు చేయాలంటేనే అభ్యర్థులు వణికిపోతున్నారు. ఆన్‌లైన్‌ అగచాట్లు తలబొప్పి కట్టిస్తుండగా.. అర్హత నిబంధనలు తికమకపట్టిస్తున్నాయి. పది, ఇంటర్‌లో 40 నుంచి 50 శాతం మార్కులు సాధించి ఉండాలని, అలాగే డిగ్రీలో 50 శాతం, పీజీలో 55 శాతం తప్పనిసరి చేయడంతో అభ్యర్థులు అయోమయంలో పడ్డారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 శాతం వెసులుబాటు కల్పించారు. గతంలో జరిగిన డీఎస్సీలో ఇలాంటి కఠిన నిబంధనలు లేవని, కొత్తగా పది, ఇంటర్‌, డిగ్రీ మార్కుల అర్హతలను ప్రామాణికం చేయడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడంలేదని డీఎస్సీ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

OU Exams Postponed: ఓయూ పరీక్షలు వాయిదా

ఇది కుట్రలో భాగమేనా?

సివిల్స్‌ సర్వీసుకు సైతం ఎలాంటి నిబంధనలు లేవు. పది, ఇంటర్‌లో సప్లమెంటరీ పరీక్షలు రాసి 35 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన ఎంతో మంది సివిల్స్‌ సాధించారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులయ్యారు. అలాంటిది టెట్‌ పరీక్ష ఉత్తీర్ణత సాధించినా పది, ఇంటర్‌, డిగ్రీల పర్సెంటేజ్‌పై నిబంధనలు పెట్టడం విమర్శలకు తావిస్తోంది. డీఎస్సీని సజావుగా జరపకూడదనే కుట్రతోనే ప్రభుత్వం మెలికలతో కూడిన డీఎస్సీని విడుదల చేసిందని నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.

ప్రాథమిక పాఠశాలలు – 3,766

ప్రాథమికోన్నత పాఠశాలలు – 445

TSPSC Group 1 Issue : Group-1 తెలుగు మీడియం అభ్య‌ర్థికి ఇంత అన్యాయ‌మా..? | UPSC Civils ఇంట‌ర్వ్యూకి సెల‌క్ట్ అయ్యా.. కానీ..?

ఉన్నత పాఠశాలలు – 705

ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు– 6,245

ప్రస్తుతం భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ ఇచ్చిన పోస్టులు – 1,478

పోటీపడనున్న అభ్యర్థులు – 72 వేల మంది

అర్హత మెలికతో డీఎస్సీకి దూరం కానున్న అభ్యర్థులు – 14 వేల మంది

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 28 Apr 2025 08:18AM

Photo Stories