పీజీ వైద్య కోర్సులకు సేల్ఫ్ డిక్లరేషన్ తప్పనిసరి.. ఎన్‌ఎంసీ కీలక మార్గదర్శకాలు జారి!
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్: దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి కొత్త పీజీ మెడికల్ కోర్సులు ప్రారంభించేందుకు దరఖాస్తు చేసిన కళాశాలలు మరియు ఇప్పటికే యూజీ/పీజీ సీట్ల పెంపు కోరిన సంస్థలు తప్పనిసరిగా సెల్ఫ్ డిక్లరేషన్ ఫారమ్‌ను సమర్పించాల్సి ఉంటుందని జాతీయ వైద్య కమిషన్ (NMC) ఆదేశించింది.

అవసరమైన గడువు:
ఈ ఫారాన్ని NMC అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న లింక్ ద్వారా 2025 మే 9 సాయంత్రం 6 గంటలలోపు అప్లోడ్ చేయాలి.
అఫిడవిట్ తప్పనిసరి:
సెల్ఫ్ డిక్లరేషన్‌తో పాటు రూ.100 స్టాంప్ పేపర్‌పై నోటరీ ద్వారా ధృవీకరించిన అఫిడవిట్ జత చేయాల్సి ఉంటుంది.
చదవండి: Health Educator Jobs: ‘హెల్త్ ఎడ్యుకేటర్ ఉద్యోగాలు విరితోనే భర్తీ చేయాలి'
పీజీఎంఈబీ నోటీసు ప్రకారం:
ఈ సూచనలు ఏప్రిల్ 23న జారీ చేసిన పబ్లిక్ నోటీసులో పేర్కొన్నాయి. అన్ని మెడికల్ కళాశాలలు ఈ మార్గదర్శకాలను పాటించాలని ఎన్‌ఎంసీ కార్యదర్శి డాక్టర్ రాఘవ్ లాంగర్ స్పష్టం చేశారు.
![]() ![]() |
![]() ![]() |
Published date : 25 Apr 2025 03:15PM
Tags
- PG medical courses admission 2025
- NMC self declaration form PG courses
- Medical colleges PG seat increase 2025
- NMC PG course application guidelines
- Medical education 2025–26 India
- NMC affidavit requirement PG courses
- How to submit self declaration NMC
- PG Medical Education Board notice 2025
- Medical college affidavit for PG seats
- Postgraduate medical courses approval India
- HealthcareEducation
- NMCGuidelines