Skip to main content

IAS Officer Kajal Jawla Sucess Story: 4 సార్లు ఓటమి.. 5వ సారి ఐఏఎస్‌గా..కాజల్‌ జావ్లా సక్సెస్‌ స్టోరీ

గొప్ప గొప్ప కలలు అందరూ  కంటారు. కానీ సాధించాలన్న ఆశయం ఉన్నవారు, లక్ష్యంతో పని చేసిన వాళ్లు మాత్రమే  తమ కలల్ని సాకారం చేసుకుంటారు.  క్రమశిక్షణ, కఠోరశ్రమ సవాళ్లను స్వీకరించే లక్షణం, ఫోకస్, డెడికేషన్ ఉన్నవారే లక్ష్య సాధనలో సఫలీ కృతులౌతారు. అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటారు కాజల్ జావ్లా (Kajal Jawla). పెళ్లి, ఉద్యోగ బాధ్యతలను మోస్తూనే సివిల్స్‌ ర్యాంక్‌ సాధించి  ఐఏఎస్ ఆఫీసర్‌గా నిలిచారు.  స్ఫూర్తిదాకమకమైన కాజల్‌  జావ్లా సక్సెస్‌ గురించి తెలుసుకుందామా!
IAS Officer Kajal Jawla Sucess Story
IAS Officer Kajal Jawla Sucess Story

కాజల్ జావ్లా ఉత్తరప్రదేశ్‌లోని మధురలో 2010లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్(ECE)  పట్టా అందుకుంది. ఆ తరువాత ప్రముఖ ఐటీ కంపెనీ విప్రోలో ఉద్యోగం. రూ.23 లక్షల వార్షిక ప్యాకేజీ.   ప్రేమించే భర్త. అందమైన కుటుంబం.  కానీ  ఐఏఎస్‌  కావాలన్న కల మాత్రం అలాగే  ఉండిపోయింది. అందుకే భర్తతో మాట్లాడి,  ఆయన మద్దతుతో  ఐఏఎస్ కావాలనే తన సంకల్ప సాధనకు నడుం బిగించింది. ఫుల్‌టైమ్ జాబ్ చేస్తూనే ఖాళీ సమయంలో సివిల్స్ కోసం ప్రిపేర్ అయింది. కార్పొరేట్ ఉద్యోగం నుండి బయటపడి తన సహోద్యోగులు అంతా  చిల్‌ అవుతోంటే  కాజల్‌ మాత్రం రాత్రి ఎనిమిది గంటలకు క్యాబ్ ఎక్కి ఇంటికి వెళ్ళేది. అలా తొమ్మిదేళ్ల పాటు రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగింది.

ఐదోసారి ఆల్‌ఇండియా ర్యాంకుతో..

దేశంలోని అత్యంత గౌరవనీయమైన సివిల్ సర్వెంట్ల ర్యాంకులకు ఎదగాలనే అచంచలమైన సంకల్పంతో పగలూ రాత్రి కష్టపడింది. కానీ అనుకున్నది సాధించేందుకు నాలుగు సార్లు నిరాశను, ఓటమిని భరించాల్సి వచ్చింది. ప్రిలిమ్స్ క్వాలిఫై అయినప్పటికీ  మెయిన్స్ క్లియర్‌ చేయలేకపోయింది. అయినా  పట్టుదల వదలకుండా ఓర్పు, దృఢ సంకల్పంతో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)కు సిద్ధమైంది. ఐదోసారి UPSC 2018 పరీక్షలో 28వ ఆల్ ఇండియా ర్యాంక్  సాధించడంతో  ఆమె కలలు నిజమయ్యాయి.

 

Model Schools Admissions : ఆద‌ర్శ పాఠ‌శాల‌ల్లో ప్ర‌వేశాల‌కు నోటిఫికేష‌న్.. ద‌ర‌ఖాస్తుకు చివరి తేదీ ఇదే


2012లో 24 సంవత్సరాల వయసులో ఆమె UPSC సన్నాహాలు మొదలు పెట్టింది. ఆమె మొదటి ప్రయత్నం సానుకూల ఫలితాన్ని ఇవ్వలేదు, 2014 ,2016లోనూ అదే రిజల్ట్‌. వివాహం అనంతరం భర్త ఆశిష్‌మాలిక్‌తో తన దీర్ఘకాలిక ఆశయాన్ని వెల్లడించింది. ఈ ప్రయాణంలో కాజల్ జావ్లాకు ఢిల్లీలోని అమెరికన్ ఎంబసీలో  పనిచేసే భర్త ఆశిష్ మాలిక్‌ సంపూర్ద మద్దతునిచ్చాడు.

 

Two Days Holidays: గుడ్‌న్యూస్‌.. ఈనెల 5, 6 తేదీల్లో సెలవులు.. కారణమిదే

ప్రారంభంలో తన వైఫల్యాలకు కారణం సమయం లేకపోవడమేనని కాజల్ చెప్పింది. ‘సమయం చాలా కీలకం. ప్రిపరేషన్‌కు సరిపడా సమయం లేకపోవడం సవాల్ లాంటిది. నా తొలి వైఫల్యానికి కారణం టైమ్ లేక పోవడమే.’ అంటూ తన అనుభవం గురించి చెప్పింది. ఓటమికి తలవంచకుండా, వైఫల్యానికి గల కారణాలను సమీక్షించుంటూ అచంలచమైన పట్టుదలతో తాను అనుకున్నది సాధించిన కాజల్‌ తనలాంటి వారెందరికో ప్రేరణగా నిలిచింది.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)


 

Published date : 03 Mar 2025 08:20AM

Photo Stories