Skip to main content

NEET UG Top Ranker Success Story : ఎలాంటి కోచింగ్ లేకుండానే నీట్‌లో... 720/720 మార్కులు సాధించానిలా.. కానీ...!

నీట్‌లో మంచి ర్యాంక్ సాధించాల‌ని... చాలా మంది క‌ఠోర ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. ఇంకా చాలా మంది పెద్ద పెద్ద ఇన్‌స్టిట్యూట్‌లలో కోచింగ్‌లు తీసుకుని చదువుతుంటారు. అయినా కూడా అనుకున్న​ ర్యాంకు సాధించలేక చతికిల పడుతుంటారు.
tathagat avatar neet top ranker 720 out of 720 marks

తల్లిందండ్రులకు ఆర్థిక భారాన్ని కలిగిస్తున్నామనే బాధ ఓ పక్క, చదవలేక మరోవైపు నానా ఇబ్బందులు పడుతుంటారు కొందరు విద్యార్థులు. అలాంటి వాళ్లకు ఈ కుర్రాడే స్ఫూర్తి. ఎలాంటి కోచింగ్‌ లేకుండానే నూటికి నూరు శాతం మార్కులు తెచ్చుకుని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇత‌ని పేరు తథాగత్ అవతార్. ఈ నేప‌థ్యంలో నీట్ టాప‌ర్‌ తథాగత్ అవతార్ స‌క్సెస్ స్టోరీ మీకోసం...

కుటుంబ నేప‌థ్యం : 
ఆ కుర్రాడే బీహార్‌లోని మధుబనిలోని ఆంధ్రాతర్హి గ్రామానికి చెందిన తథాగత్ అవతార్. తథాగత్‌ విద్యావేత్తల కుటుంబం నుంచి వచ్చాడు. అతని తల్లి కవితా నారాయణ్‌ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు, తండ్రి మిడిల్‌ స్కూల్‌లో టీచర్‌. తల్లి తరుఫు తాత అశోక్‌ చౌదరి మధుబనిలోని జూనియర్‌ కళాశాల లైబ్రేరియన్‌. అతని తాత ఇప్పటికీ తన పూర్వీకుల గ్రామమైన గెహుమాబెరియాలో నివశిస్తున్నారు. కానీ తథాగత్, అతని కుటుంబం ప్రస్తుతం అతని తాత గ్రామమైన ఆంధ్రతార్హిలో నివసిస్తున్నారు.

చదవండి: Success Story: సొంతంగానే గ్రూప్‌-1కి ప్రిపేర‌య్యా.. టాప్ ర్యాంక్‌ కొట్టా.. డిప్యూటీ కలెక్టర్ అయ్యా..

తొలి ప్రయత్నంలో...
తథాగత్ అవతార్... నీట్‌ పరీక్షలో 720/720 మార్కుల స్కోరు సాధించాడు. అతడి విజయ ప్రస్థానం అంత ఈజీగా సాగలేదు. అతడు కూడా అందరిలానే తొలి ప్రయత్నంలో కాస్త ఇబ్బంది పడ్డాడు. కానీ 611 మార్కులు సాధించాడు. 
అయితే మంచి కాలేజ్‌లో ఎంబీబీఎస్‌ చేయాలన్న కోరికతో మరోసారి ప్రయత్నించాడు. ఈసారి మరింత కష్టపడి చదివాడు. అతడి కృషి ఫలించి నీట్‌ 2024లో మంచి మార్కులు సాధించి టాప్‌ ర్యాంకు తెచ్చుకున్న ఇతర అభ్యర్థుల సరసన నిలిచాడు. అయితే నీట్‌ యూజీ తాత్కాలికి సమాధాన కీ ఆధారంగా తొలుత 715 మార్కులు స్కోర్‌ చేయగా, జూన్‌ 4న విడుదల చేసిన సవరించిన కీ ఆధారంగా అతని స్కోరు 720 రావడం జరిగింది. ఆల్‌ ఇండియా ప్రథమ ర్యాంకులో నిలచాడు. అతను ఇప్పుడు ఢిల్లీ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్‌ ఫస్ట్‌ ఈయర్‌ చదువుతున్నాడు.

గ్రామంలోనే ఉండి.. సొంతంగా చ‌దివి...
తథాగత్‌ తన గ్రామంలోనే ప్రిపరేషన్‌ కొనసాగించాడు. ఆన్‌లైన్‌ తరగతులకు హాజరవ్వుతూ ప్రిపేరయ్యాడు. అతడు చిన్ననాటి నుంచే స్వతహాగా తెలివైన విద్యార్థి అని తల్లిదండ్రులు, బంధువులు చెబుతున్నారు. అతడు ఇంతలా మంచి మార్కుల తెచ్చుకున్నందుకు తమకెంతో గర్వంగా ఉందని అతడి కుటుంబం చెబుతోంది. ఎయిమ్స్‌లో చదవాలనేది తన జీవితకాల కల అని అందుకే ఇంతలా కష్టపడ్డానని, తన కృషి ఫలించిందని ఆనందంగా చెబుతున్నాడు తథాగత్‌. అయితే భారతదేశంలో ఉన్న వైద్యుల కొరత, ఆర్థిక పరిమితులు దృష్ట్యా ఎంతమంది విద్యార్థులు డాక్టర్‌ చదువు అభ్యసించలేక ఇబ్బందులు పడుతున్నారో చూస్తే బాధనిపించిందని, అదే తనకు డాక్టర్‌​  అయ్యేందుకు ప్రేరణనిచ్చిందని అన్నాడు. 

➤☛ Success Story: గ్రూప్-2లో విజయం సాధించా.. మళ్లీ గ్రూప్-2 రాశా.. ఎందుకంటే..?

చింతించకుండా మంచి ర్యాంకు...
ముందుకు ఖర్చు గురించి విద్యార్థులు చింతించకుండా మంచి ర్యాంకు తెచ్చుకోవడంపై దృష్టిపెడితే తక్కువ ఖర్చుతోనే మంచి ప్రభుత్వ కళాశాలల్లో చదువుకోగలుగుతారని తథాగత్‌ చెబుతున్నాడు. ఈ విధంగా మరింతమంది అర్హులైన విద్యార్థులు నైపుణ్యం కలిగిన వైద్యులుగా మారి దేశానికి సేవ చేస్తారని చెబుతున్నాడు తథాగత్‌.

Published date : 07 Mar 2025 08:29AM

Photo Stories