IAS officers Divya Tanwar Success Story: చిన్న యవసులోనే ఐఏఎస్‌గా సెలక్ట్ అయ్యింది.. దివ్య సక్సెస్ జర్నీ ఇదే

ఆమె ఎవరంటే..హర్యానాలోని మహేంద్రగఢ్ జిల్లాకు చెందిన దివ్వ తన్వర్.. చిన్నప్పటి నుంచి మంచి తెలివైన విద్యార్థి.అయితే చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి అతి పెద్ద విషాదాన్ని ఎదుర్కొంది. ఇంటి పెద్దదిక్కు లేకపోతే ఆ కుటుంబం ఎలా రోడ్డునపడుతుందో పసివయసులోనే తెలుసుకుంది.
నిత్యం చుట్టుముట్టే ఆర్థిక కష్టాలు చదవాలనే ఆలోచనను చెరిపేస్తున్నా..మొండి పట్టుదలతో చదువును సాగించింది. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా..తన ఆనందం మొత్తం చదువులోనే వెతుక్కునేది దివ్య. అదే తన కష్టాలను దూరం చేసే వజ్రాయుధమని బలంగా అనుకునేది.
IAS and IPS Sisters Success Story : కఠిన పేదరికాన్ని జయించి... అక్క ఐఏఎస్ , చెల్లెలు ఐపీఎస్ ఉద్యోగాన్ని కొట్టారిలా... కానీ...
ఎంతటి దీనస్థితిలో బాధలు అనుభవిస్తున్నా సరే ఎక్కడా చదువుని నిర్లక్ష్యం చేయలేదు. అలా దివ్య ప్రాథమిక విద్యను మహేంద్రగఢ్‌లోని నవోదయ విద్యాలయంలో పూర్తి చేసింది. తర్వాత మహేంద్రగఢ్‌లోని ప్రభుత్వ మహిళా కళాశాల నుంచి బి.ఎస్సీ డిగ్రీని పూర్తి చేసింది. గ్రాడ్యుయేషన్ పూర్తి అయ్యిన వెంటనే యూపీఎస్సీ సివిల్స్‌పై దృష్టి పెట్టింది.
ఆఖరికి సివిల్స్ ప్రిపేరయ్యే తాహత లేకపోయినా..గురువుల మన్ననలతో వారి సాయంతో కోచింగ్ తీసుకుంది. సాధ్యం కాదనిపించే సమస్యల నడుమ వెనకడుగు వేయని ఆమె పట్టుదల ప్రతిష్టాత్మకమైన సివిల్స్‌లో విజయం సాధించేలా చేసింది. తొలి ప్రయత్నంలోనే 438వ ర్యాంకు సాధించింది.
Civils Preparation Plan: సివిల్స్‌కు సన్నద్ధమవ్వండిలా!.. పరీక్ష విధానం, ప్రిపరేషన్ తదితర వివరాలు..
అయితే తాను అనుకున్నట్లు ఐఏఎస్ పోస్ట్ సాధించలేకపోయింది. దీంతో మరోసారి ప్రయత్నించి ఏకంగా ఆల్ ఇండియా 105వ ర్యాంకు కొట్టి ఐఎస్ అధికారిణి అయ్యింది. అంతేగాదు దేశంలోని అతి పిన్న వయస్కురాలైన ఐఏఎస్ అధికారిణిగా అందరి దృష్టిని ఆకర్షించింది.
ఆమె ఐఏఎస్ కోచింగ్ వ్యవస్థాపకుడు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన వికాస్ దివ్యకీర్తికి ప్రియమైన విద్యార్థి అట. చాలామంది విద్యార్థులు ఆయనే రోల్ మోడల్. అంతలా విద్యార్థులను ప్రభావితం చేసే గురువు వికాస్‌కి ఎంతో ఇష్టమైన విద్యార్థి ఈ దివ్య తన్వర్.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)