NEET PG 2025 Exam Date Declared: బ్రేకింగ్ న్యూస్.. NEET PG పరీక్షపై బిగ్ అప్‌డేట్.. పరీక్ష తేదీ విడుదల
Sakshi Education
నీట్ పీజీ 2025 ఎగ్జామ్ డేట్ కోసం ఎదురుచూస్తున్న వైద్య విద్యార్థులకు ఎట్టకేలకు అధికారిక ప్రకటన వెల్లడైంది. నీట్ పీజీ(NEET PG)-2025 పరీక్షతేదీ ఖరారైంది. జూన్ 15న పరీక్షను నిర్వహించనున్నట్లు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్(NBEMS) ప్రకటించింది.
NEET PG 2025 Exam Date Declared News In Telugu NBE Announces NEET PG Exam 2025 Date
వైద్యవిద్య పీజీ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే నీట్ పీజీ పరీక్ష వాయిదా పడుతుందన్న ఊహాగానాల మధ్య NBEMS ప్రకటన విడుదల చేసింది. ఈ పరీక్షను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో రెండు షిఫ్టుల్లో నిర్వహిస్తారు. మరిన్ని వివరాలకు ‘ఎన్‌బీఈఎంఎస్’అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని పేర్కొంది.