Skip to main content

NEET TG Medical Counselling: నాలుగైదు రోజుల్లో మెడికల్‌ కౌన్సెలింగ్‌!.. రాష్ట్రస్థాయి మెరిట్‌ లిస్ట్‌ విడుదల!

సాక్షి, హైదరాబాద్‌: ఎంబీబీఎస్, బీడీఎస్‌ కౌన్సెలింగ్‌కు లైన్‌ క్లియర్‌ అయింది. స్థానికత వ్యవహారంలో గతంలో హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులకు ఊరటనిస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో నీట్‌ కౌన్సెలింగ్‌కు ఏర్పాట్లు చేయాలని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాల యం సూత్రప్రాయంగా నిర్ణయించింది. సుప్రీంకోర్టు నుంచి పూర్తిస్థాయి ఆదేశాలు తమకు చేరిన తర్వాత కౌన్సిలింగ్‌ ప్రక్రియను ఎలా చేపట్టాలన్న దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని యూనివర్సిటీ అధికారులు తెలిపారు.
telangana medical counseling line clear

నాలుగైదు రోజుల్లో కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని కాళోజీ వర్గాలు తెలిపాయి. కౌన్సెలింగ్‌లో భాగంగా మొదట దరఖాస్తు చేసుకున్న విద్యార్థులతో మెరిట్‌ లిస్ట్‌ తయారు చేస్తా రు. ఆ తర్వాత వారి నుంచి వెబ్‌ ఆప్షన్లు తీసుకుంటారు.

నెలాఖరు నాటికి మొదటి విడత కౌన్సెలింగ్‌ పూర్తి అయ్యే అవకాశం ఉంది. ముందుగా కనీ్వనర్‌ కోటా, తర్వాత మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లకు కౌన్సెలింగ్‌ జరగనుంది. అక్టోబర్‌ 15వ తేదీ నాటికి రెండు విడతల కౌన్సెలింగ్‌లు, ఆ నెలాఖరు నాటికి అన్ని కౌన్సిలింగ్‌లు పూర్తి చేస్తారు.  

చదవండి: Jobs In Medical College: మెడికల్‌ కాలేజీలో పోస్టులు.. 19 మంది నియామకం

17 వేల మంది దరఖాస్తు 

నీట్‌లో అక్రమాలు, సవరణ ఫలితాలతో వైద్య విద్యా సంవత్సరం ఈసారి ఆలస్యమైన సంగతి తెలిసిందే. స్థానికత వ్యవహారం మరింత ఆలస్యానికి కారణమైంది. నీట్‌లో రాష్ట్రం నుంచి 47,356 మంది అర్హత సాధించగా, అందులో 17 వేల మంది రాష్ట్రంలో మెడికల్‌ సీట్లకు దరఖాస్తు చేసుకున్నారని కాళోజీ వర్గాలు వెల్లడించాయి.

ప్రస్తుతం 15 శాతం ఆలిండియా కోటా సీట్లు, డీమ్డ్‌ వర్సిటీలు, సెంట్రల్‌ యూనివర్శిటీలు, ఈ ఎస్‌ఐసీ, ఏఎఫ్‌ఎంసీ, బీహెచ్‌యూ, ఏఎంయూ సీట్లకు రెండో విడత కౌన్సెలింగ్‌ పూర్తయింది. ఇంకా రెండు విడతల కౌన్సెలింగ్‌ జరగాల్సి ఉంది. వాస్తవానికి జాతీయ స్థాయిలో మొదటి విడత కౌన్సెలింగ్‌ పూర్తయిన తర్వాత రాష్ట్రస్థాయిలో మొదటి విడత కౌన్సెలింగ్‌ నిర్వహించాలి.

అలాగే రెండో విడత జాతీయ కౌన్సెలింగ్‌ తర్వాత రాష్ట్రంలో రెండో విడత మొదలవుతుంది. కానీ స్థానికత అంశం కోర్టులో ఉండటంతో ఇప్పటివరకు రా ష్ట్రంలో కౌన్సెలింగ్‌ ప్రారంభం కాలేదు. జాతీయ కౌన్సెలింగ్‌లు జరుగుతున్నా, ఇక్కడ ప్రారంభం కాకపోవడంతో విద్యార్థులకు నష్టం వాటిల్లుతోంది.

అనేకమంది విద్యార్థులు తమకు ఇష్టం లేకపోయినా జాతీయ కౌన్సెలింగ్‌ ద్వారా వివిధ రాష్ట్రాల్లో చేరారు. వారు ఇక్కడ చేరాలనుకుంటే ఎలాంటి వెసులుబాటు ఇస్తారో చూడాల్సి ఉంది. మరోవైపు ఇతర రాష్ట్రాల్లోనూ కౌన్సెలింగ్‌లు జరుగుతున్నాయి. వచ్చే నెల ఒకటో తేదీ నుంచే తరగతులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రాల్లో మొదటి విడత కౌన్సెలింగ్‌ పూర్తి చేసుకున్న విద్యార్థులు, జాతీయ కౌన్సెలింగ్‌ ద్వారా సీట్లు సాధించిన విద్యార్థులు తరగతులకు హాజరవుతారు.  

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

‘స్థానికత’తో ఆలస్యం 

రాష్ట్రంలో ఎంబీబీఎస్‌ సహా ఇతర మెడికల్‌ కో ర్సులకు కౌన్సెలింగ్‌లో భాగంగా రిజిస్ట్రేషన్లు, వెరిఫికేషన్‌ ప్రక్రియ పూర్తయింది. ఆప్షన్లు పెట్టుకునే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉన్నా స్థానికత అంశం కోర్టులో ఉండటంతో ఆలస్యమైంది. ఈసారి ప్రభుత్వం స్థానికత అంశంలో మార్పులు చేసిన సంగతి తెలిసిందే.

చదవండి: 2,050 Nursing Officer Jobs: నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌.. పరీక్ష సిలబస్ ఇదీ..

గతంలో 6వ తరగతి నుంచి ఇంటర్‌ మధ్యలో ఏవైనా నాలుగేళ్లు తెలంగాణలో చదివిన వారిని స్థానికులుగా గుర్తించేవారు. అయితే చాలామంది ఏపీకి చెందినవారు తప్పుడు సరి్టఫికెట్లు తీసుకొచ్చి తెలంగాణ స్థానికులుగా చెప్పుకుంటున్నారని ప్రభు త్వం భావించింది. దీంతో స్థానికత విషయంలో మార్పులు చేసింది. 9, 10, ఇంటర్‌ రెండేళ్లు కలిపి మొత్తం నాలుగేళ్లు వరుసగా తెలంగాణలో చదివి న వారినే స్థానికులుగా గుర్తించాలని పేర్కొంటూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలోనే కొందరు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు.

Published date : 21 Sep 2024 03:28PM

Photo Stories