Skip to main content

TSPSC Group 1 Jobs Update News : టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ రద్దు కుదరదు.. ఎందుకంటే...?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ రద్దు కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
Supreme Court ruling on TSPSC Group-1 notification  Telangana Public Service Commission Group-1 mains exam update  TSPSC Group-1 mains exam news update  TGPSC Group-1 Mains 2024 Big Relief To Telangana Govt Over Group 1 Exams
TGPSC Group-1 Mains 2024 Big Relief To Telangana Govt Over Group 1 Exams

గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ రద్దు చేయాల‌ని.. అలాగే మెయిన్స్ ప‌రీక్ష‌ వాయిదా వేయాలని కోరుతూ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 

ప్రిలిమ్స్‌లో 14 తప్పులున్నాయని..
టీఎస్‌పీఎస్సీ ఇచ్చిన గ్రూప్‌-1 కొత్త నోటిఫికేషన్‌ చట్టవిరుద్ధమని కొందరు అభ్యర్థులు గతంలో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రిలిమ్స్‌లో 14 తప్పులున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. గ్రూప్‌-1 మెయిన్స్‌ వాయిదా వేయాలని హైకోర్టును కోరారు. అయితే అభ్యర్థుల పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్‌చేస్తూ అభ్యర్థులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. అయితే.. పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం డిసెంబ‌ర్ 6వ తేదీన‌(శుక్రవారం) తీర్పు వెలువరించింది. 

☛➤ CM Revanth Reddy : 55 వేలకు పైగా గ‌వ‌ర్న‌మెంట్ ఉద్యోగాల‌ను ఇలా భ‌ర్తీ...? కానీ..

వీరు గ్రూప్‌-1 మెయిన్స్‌కు క్వాలిఫై కానందున..
పిటిషనర్లు గ్రూప్‌-1 మెయిన్స్‌కు క్వాలిఫై కానందున మెయిన్స్‌ పరీక్ష వాయిదా వేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. పరీక్షల నిర్వహణలో కోర్టుల జోక్యం అనవసరమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కోర్టుల జోక్యంతో నియామకాల్లో తీవ్ర జాప్యం జరుగుతుందని అభిప్రాయపడింది.

☛➤ TSPSC Group-1 Mains Results Date 2024 : తెలంగాణ గ్రూప్‌-1 ఫ‌లితాలు విడుద‌ల ఎప్పుడంటే...?

Published date : 07 Dec 2024 10:28AM

Photo Stories