Skip to main content

Sankranti Holidays 2025 Clarity : సంక్రాంతి సెల‌వుల‌పై క్లారిటీ.. వీరికి మాత్రం ఒక‌రోజు ఎక్కువ‌.. మొత్తం ఎన్నిరోజులంటే..!!

రాష్ట్రంలోని విద్యాసంస్థ‌ల‌కు సాధారణ సెల‌వులు కాదు.. ఏకంగా ఒక వార‌మే సెల‌వులు రాబోతున్నాయి.
Sankranti holidays clarity for telangana schools and junior colleges

సాక్షి ఎడ్యుకేష‌న్: రాష్ట్రంలోని విద్యాసంస్థ‌ల‌కు సాధారణ సెల‌వులు కాదు.. ఏకంగా ఒక వార‌మే సెల‌వులు రాబోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పండుగకు పాఠ‌శాల‌ల‌కు, ఇంటర్మీడియట్ కాలేజీలు ప్రత్యేక సెలవుల‌ను ప్రకటించింది. ఇది మూడు రోజుల పండుగ కాగా, మూడు రోజుల‌కే కాకుండా, ఏకంగా వారం రోజుల‌కు సెల‌వుల‌ను ప్ర‌క‌టించింది ప్ర‌భుత్వం. ఎక్క‌డెక్క‌డో స్థిర‌ప‌డ్డ‌వారంతా వారి ఊరికి వెళ్లి ఈ పండుగను జ‌రుపుకుంటారు. తాజాగా, ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన ఈ ఉత్తర్వుల ప్రకారం..

School Holidays Extented In 2025: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. జనవరి 15 వరకు అన్ని స్కూల్స్‌ బంద్‌

ఒక రోజు ఎక్కువ‌..

తెలంగాణ రాష్ట్రంలోని విద్యాసంస్థ‌ల‌కు జనవరి 11 నుంచి జనవరి 16 వరకు ఇంటర్మీడియట్ కాలేజీలకు 6 రోజుల పాటు సెలవులు ఉంటాయి. అయితే, స్కూళ్లకు మాత్రం జనవరి 11 నుంచి జనవరి 17 వరకు ఒక రోజు ఎక్కువ‌గా పూర్తిగా 7 రోజుల సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. బీఐఈ బోర్డ్ ఆఫ్ ఇంట‌ర్మీడియ‌ట్ ఎడ్యుకేష‌న్ కార్యదర్శి ప్రకారం.. ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ స్కూళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ పాఠశాలలు, మోడల్ పాఠశాలలు, బీసీ సంక్షేమ పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలతో సహా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు ఈ సెలవులు వర్తిస్తాయి. రెండు ఏళ్ల ఇంటర్మీడియట్ కోర్సును అందించే ఇతర డిగ్రీ కళాశాలలకు కూడా సంక్రాంతి సెలవులు ఉంటాయి.

School holidays: అన్ని స్కూళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం.. కారణమిదే!

ఆదేశాల‌ను ఉల్లంగిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వు..

తెలంగాణ‌ ప్రభుత్వం విడుదల చేసిన సెల‌వుల‌ ప్రకటనలో.. టీజీ బీఐఈ సెలవుల షెడ్యూల్‌ను కచ్చితంగా పాటించాలని విద్యాసంస్థ‌ల‌ ప్రిన్సిపాల్లంద‌రికీ ఈ ఆదేశాలను జారీ చేసింది. ఈ సెలవుల కాలంలో ఎలాంటి తరగతులు నిర్వహించకూడదని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ జూనియర్ కాలేజీలను బోర్డు ప్రత్యేకంగా ఆదేశించింది.
టీజీ బీఐఈ ఈ సూచనలను ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణించడం జరుగుతుందని, నాన్-కాంప్లైంట్ మేనేజ్‌మెంట్‌పై అనుబంధంతో సహా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 09 Jan 2025 12:26PM

Photo Stories