Skip to main content

APPSC-RIMC Admissions: ఎనిమిదో తరగతిలో ప్రవేశాలు.. పరీక్షా విధానం, దరఖాస్తు విధానం ఇలా..

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ).. డెహ్రాడూన్‌(ఉత్తరాఖండ్‌)లోని రాష్ట్రీయ ఇండియన్‌ మిలిటరీ కాలేజ్‌(ఆర్‌ఐఎంసీ)లో జనవరి-2026 టర్మ్‌ ఎనిమిదో తరగతి ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బాలురు, బాలికల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
APPSC-RIMC Admissions APPSC-RIMC Admissions in Class VIII
APPSC-RIMC Admissions APPSC-RIMC Admissions in Class VIII

అర్హత: గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 2026 జనవరి 1వ తేదీ నాటికి ఏడో త‌ర‌గ‌తి చదువుతున్న లేదా ఏడో త‌ర‌గ‌తి ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు. 
వయస్సు: 01.01.2026 నాటికి పదకొండున్నర ఏళ్లకు తగ్గకుండా పదమూడేళ్లకు మించకుండా ఉండాలి. అంటే 02.01.2013 - 01.07.2014 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి.

Admissions In Music Diploma: మ్యూజిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఇదే

ఎంపిక విధానం: రాతపరీక్ష, వైవా వోస్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్షా విధానం: రాతపరీక్షలో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. అవి మ్యాథమేటిక్స్‌(200 మార్కులు), జనరల్‌ నాలెడ్జ్‌(75 మార్కులు), ఇంగ్లిష్‌(125 మార్కులు) నుంచి ప్రశ్నలు ఉంటాయి. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు వైవావోస్‌(50 మార్కులు) నిర్వహిస్తారు. రాతపరీక్ష, వైవా వోస్‌ కలిపి మొత్తం 450 మార్కులకు కేటాయించారు. దీనిలో కనీస ఉత్తీర్ణత మార్కులు 50శాతం ఉండాలి. ఈ రెండింటిలో అర్హత సాధించిన అభ్యర్థులకు చివరిగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఫీజు చెల్లించా­లి. ఆర్‌ఐఎంసీ పంపిన దరఖాస్తు ఫారం నింపి అవసరమైన ధ్రువపత్రాలు జతచేసి అసిస్టెంట్‌ సెక్రటరీ(ఎగ్జామ్స్‌), ఏపీ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్, న్యూ హె డ్స్‌ ఆఫ్‌ ద డిపార్ట్‌మెంట్స్‌ బిల్డింగ్, రెండో అంతస్తు, ఆర్టీఏ కార్యాలయం దగ్గర, ఎంజీ రోడ్డు, విజయవాడ చిరునామకు పంపించాలి.

Jobs In HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

దరఖాస్తులకు చివరితేది: 31.03.2025.
పరీక్ష తేది: 01-06-2025.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 09 Jan 2025 05:12PM
PDF

Photo Stories