Skip to main content

Gurukul Admission Notification 2025 : వివిధ‌ గురుకులాల్లో ప్ర‌వేశానికి నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ముఖ్య‌మైన తేదీలు వివ‌రాలు ఇవే..

2025-26 విద్యా సంవత్సరంలో వివిధ గురుకులాల్లో ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశాల కోసం ప్రభుత్వం నోటిఫికేష‌న్ ను విడుద‌ల చేసింది.
Notification for admissions at telangana state gurukul schools   Telangana government gurukuls offering bright future for students  Details of successful applicants for Telangana gurukul admissions

సాక్షి ఎడ్యుకేష‌న్: తెలంగాణ ప్ర‌భుత్వ గురుకులాల్లో విద్యార్థుల‌కు ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు ఉంటుంద‌ని, ఇక్క‌డ విద్య‌ను పొందితే ఉన్న‌తంగా రాణించే అవ‌కాశం ఉంటుందని తెలిపారు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. 2025-26 విద్యా సంవత్సరంలో వివిధ గురుకులాల్లో ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశాల కోసం ప్రభుత్వం నోటిఫికేష‌న్ ను విడుద‌ల చేసింది. అయితే, ఈ గురుకులాల్లో ప్ర‌వేశం పొందేందుకు అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న‌ విద్యార్థినీ విద్యార్థులు ప్ర‌క‌టించిన విధంగా, ఉన్న గ‌డువులోగా ద‌ర‌ఖాస్తుల‌ను పూర్తి చేయాల‌ని సూచించారు ఆయ‌న‌. ఈ అవ‌కాశాన్ని ప్ర‌తీ విద్యార్థులు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు. ఈ మెర‌కు ద‌ర‌ఖాస్తుల వివ‌రాలను వెల్లడించారు..

Admission Into AP Model Schools : మోడల్‌ స్కూల్‌లో ప్రవేశానికి గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే?

ద‌ర‌ఖాస్తుల‌కు ప‌త్రాలు: కుల ధ్రువీకరణ పత్రం నెంబరు, ఆదాయ ధ్రువీకరణ పత్రం నెంబరు, ఆధార్ కార్డు నెంబరు, బర్త్ సర్టిఫికెట్, ఫోటోలు ముఖ్యం.

గురుకులాలు.. త‌ర‌గ‌తులు: 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు, ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో 6 నుండి 9 వ తరగతి వరకు ఖాళీ సీట్లలో ప్రవేశాల కోసం, గౌలిదొడ్డి లోని సాంఘిక సంక్షేమ గురుకులంలో 9వ తరగతిలో ప్రవేశాల కోసం, ఖమ్మం లోని గిరిజన సంక్షేమ గురుకులం, పరిగిలో ఎస్.ఓ.ఈలలో 8 వ తరగతిలో ప్రవేశాలకై, అలుగునూరులోని సి.ఓ.ఈలో 9 వ తరగతిలో అడ్మిషన్ల కోసం, రుక్మాపూర్ సైనిక్ స్కూల్, మల్కాజ్ గిరి ఫైన్ ఆర్ట్స్ స్కూల్ లో 6 వ తరగతి.

Navodaya Admissions Exams : ఈనెల 18న వ‌రకు న‌వోద‌య ప్ర‌వేశ ప‌రీక్ష.

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: ఫిబ్ర‌వ‌రి 1వ తేదీలోగా

ధృవ‌ప‌త్రాల స‌మ‌ర్ప‌న‌: ధ్రువీకరణ పత్రాల సత్వర జారీ కోసం కలెక్టరేట్ లో సహాయ కేంద్రం ఏర్పాటు చేశామని, ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ కేంద్రం తెరిచి ఉంటుంది.

ఎంపిక విధానం: కామన్ ఎంట్రన్స్ టెస్ట్

ద‌రఖాస్తుల విధానం: ఆన్‌లైన్‌లోంచి

ప్ర‌వేశ ప‌రీక్ష తేదీ: 23 ఫిబ్ర‌వ‌రి, 2025న కామ‌న్ ఎంట్ర‌న్స్ టెస్ట్ ఉంటుంది.

అధికారిక వెబ్‌సైట్‌: https://tgcet.cgg.gov.in

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 09 Jan 2025 11:37AM

Photo Stories