Skip to main content

Contract and outsourcing jobs: 10వ తరగతి అర్హతతో AP కాంట్రాక్ట్ / అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల జీతం నెలకు 32,670

ap contract jobs
ap contract jobs

ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ విధానంలో మూడు రకాల ఉద్యోగాలు భర్తీ కోసం దరఖాస్తుల కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో కేవలం పదో తరగతి అర్హతతో అప్లై చేసుకునే విధంగా ఎక్కువ సంఖ్యలో పోస్టులు ఉన్నాయి.

భారతదేశంలో నకిలీ విశ్వవిద్యాలయాల జాబితా విడుదల: Click Here

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో DMHO కార్యాలయం నుండి విడుదలైంది. 

పోస్టుల పేర్లు:  నోటిఫికేషన్ ద్వారా ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 , FNO, శానిటరీ అటెండర్ కం వాచ్మెన్ అనే ఉద్యోగాలు భర్తీ కోసం దరఖాస్తులు కోరుతున్నారు. 

విద్యార్హత: 
ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు DMLT / బీఎస్సీ (MLT) వంటి విద్యార్హతలు ఉన్నవారు అర్హులు. 
FNO ఉద్యోగాలకు 10వ తరగతి అర్హతతో పాటు గుర్తింపు పొందిన సంస్థ నుండి ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ పొందినవారు అర్హులు. 
శానిటరీ అటెండర్ కం వాచ్మెన్ ఉద్యోగాలకు 10వ తరగతి పాస్ అయిన వారు అర్హులు.

ఖాళీలు: 
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 61 పోస్టులు భర్తీ చేస్తున్నారు.  
పోస్టుల వారీగా ఖాళీలు వివరాలు క్రింద విధంగా ఉన్నాయి. 
ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 – 03 పోస్టులు
FNO – 20 పోస్టులు
శానిటరీ అటెండర్ కం వాచ్మెన్ – 38 పోస్టులు

జీతము: 
ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 – 32,670/-
FNO – 15,000/-
శానిటరీ అటెండర్ కం వాచ్మెన్ – 15,000/-

ముఖ్యమైన తేదీలు : 
నోటిఫికేషన్ విడుదల తేదీ : 31-12-2024
అప్లికేషన్ ప్రారంభ తేదీ : 06-01-2025
అప్లికేషన్ చివరి తేదీ : 20-01-2025
ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదీ : 05-02-2025
అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే తేదీ : 15-02-2025

వయస్సు: 
18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్రింది విధంగా వయసులో సడలింపు కూడా వర్తిస్తుంది. 
అనగా ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసులో సడలింపు వర్తిస్తుంది.
విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు పది సంవత్సరాల వరకు వయసులో సడలింపు వర్తిస్తుంది.

అప్లికేషన్ ఫీజు వివరాలు:
ఓసి, బీసీ అభ్యర్థులు 500/- ఫీజు చెల్లించాలి. 
ఎస్సీ, ఎస్టి, మరియు దివ్యాంగులైన అభ్యర్థులు 200/- ఫీజు చెల్లించాలి. 

ఎంపిక విధానం: 
ఈ ఉద్యోగాల ఎంపికలో రాత పరీక్ష నిర్వహించరు.
మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అభ్యర్థులకు అర్హత పరీక్షలో వచ్చిన మార్కులు ఆధారంగా 75% మార్కులు వరకు కేటాయిస్తారు.
అభ్యర్థులకు ఉన్న అనుభవానికి 15% మార్కుల వరకు కేటాయిస్తారు
మరియు ఉద్యోగానికి అప్లై చేయడానికి అవసరమైన అర్హత కోర్సు పూర్తి చేసినప్పటి నుండి ఇప్పటివరకు పూర్తయిన సంవత్సరాలకు ప్రతి సంవత్సరానికి ఒక మార్క్ కేటాయిస్తూ గరిష్టంగా 10% మార్కులు కేటాయిస్తారు. 

అనుభవానికి మార్కుల కేటాయింపు ఇలా చేస్తారు: 
గిరిజన ప్రాంతాల్లో పని చేస్తే ప్రతీ ఆరు నెలలకు 2.5 మార్కులు కేటాయిస్తారు.
గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తే ప్రతీ ఆరు నెలలకు 2 మార్కులు కేటాయిస్తారు.
పట్టణ ప్రాంతాల్లో పని చేస్తే ప్రతీ ఆరు నెలలకు ఒక మార్కు కేటాయిస్తారు.

పోస్టింగ్ : ఎంపికైన వారు తూర్పుగోదావరి జిల్లాలో పనిచేయాల్సి ఉంటుంది. 

అప్లికేషన్ విధానము: 
ఈ ఉద్యోగాలకు అప్లై చేసేవారు ముందుగా నోటిఫికేషన్ తో పాటు ఇచ్చిన అప్లికేషన్ డౌన్లోడ్ చేసి దానిలో ఉన్న అన్ని వివరాలు సరిగ్గా నమోదు చేసి, అవసరమైన అన్ని సెల్ఫ్ అటిస్టెడ్ జిరాక్స్ కాపీలు మరియు ఫీజు చెల్లించిన డిడి జతపరిచి అప్లికేషన్ సంబంధిత కార్యాలయంలో అందజేయాలి 

అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా: O/o the District Medical & Health Officer, తూర్పుగోదావరి జిల్లా

Download Notification & Application: Click Here

Official Website: Click Here

Published date : 09 Jan 2025 03:46PM

Photo Stories