Admissions In Music Diploma: మ్యూజిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఇదే
Sakshi Education
విశాఖ విద్య: ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలోని సెయింట్ లూక్స్ ఆడియో ఇంజినీరింగ్, మ్యూజిక్ ప్రొడక్షన్ విభాగంలో సంగీత సంబంధిత డిప్లమో / పీజీ డిప్లమో సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది.
Admissions In Music Diploma
ఆడియో ఇంజినీరింగ్, మ్యూజిక్ ప్రొడక్షన్, ఫిల్మ్ ఎడిటింగ్, డబ్బింగ్, ఓకల్–ఇన్‌సు్ట్రమెంటల్ మ్యూజిక్ కోర్సులకు ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని అడ్మిషన్ల విభాగం డైరెక్టర్ డీఏ నాయుడు కోరారు. దరఖాస్తులకు ఈ నెల 23 వరకు గడువు ఉందని, 24న కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.