TGPSC Releases TPBO Results: టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ ఫలితాలు విడుదల.. ఎంపికైన అభ్యర్థుల జాబితా ఇదే
Sakshi Education
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)..టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ ఫలితాలను విడుదల చేసింది. ఉద్యోగాలకు ఎంపికైన 171 మంది అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/లో అందుబాటులో ఉంచింది. ఉద్యోగానికి ఎంపికైన విద్యార్థులు తమ హాల్‌టికెట్ నెంబర్‌తో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
TGPSC Releases TPBO Results Town Planning Building Overseer provisional list out
కాగా టీపీబీవో ఉద్యోగాలకు 2023 జులై 8న రాతపరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. గతేడాది అక్టోబరు 21-24, డిసెంబర్ 5, 6, 7, 23 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించింది. తాజాగా ప్రొవిజనల్ లిస్టును విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి రూ.32,810- 96,890 మధ్య వేతనం ఉంటుంది.