IT Instructor & PRO Jobs: ఐటీ ఇన్‌స్ట్రక్టర్, పీఆర్వో పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. అర్హతలు ఇవే..!
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలో 65 ఐటీ ఇన్‌స్ట్రక్టర్, రెండు పీఆర్‌ఓ పోస్టులను భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు గురుకుల విద్యాలయాల సంస్థ ప్రకటించింది.
ఆసక్తి ఉన్న వారు జనవరి 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఐటీ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుకు ఎంటెక్/బీటెక్/ఎంసీఏ (కంప్యూటర్స్) పూర్తి చేసిన వారు, పీఆర్‌ఓ పోస్టుకు జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేసి కనీసం పది సంవత్సరాల అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
అభ్యర్థులు 10వ తేదీన సాయంత్రం 4 గంటలలోగా మాసబ్‌ట్యాంక్‌లోని దేశోద్ధారక భవన్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ప్రధాన కార్యాలయంలో దరఖాస్తు ఫారాలను పొంది దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.
Published date : 08 Jan 2025 03:55PM