Skip to main content

TGPSC Group 2 Key: గ్రూప్-2 కీ విడుదలపై కీలక ప్రకటన.. ఇతర ఫలితాలపై కూడా ఇక నుంచి ఇలా వెల్లడి..

సాక్షి ఎడ్యుకేషన్: ఇటీవల జరిగిన గ్రూప్‌-2(Group-2) పరీక్ష ‘కీ’ని శనివారం(జనవరి 10) విడుదల చేస్తామని, ఇక నుంచి పరీక్షలు జరిగిన వారం పది రోజుల్లోనే ఫలితాలు వెల్లడిస్తామని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TGPSC) చైర్మన్‌ బుర్రా వెంకటేశం తెలిపారు.
TGPSC Chairman Burra Venkatesham announces Group-2 examination key release date  Key for Telangana Public Service Commission Group-2 exam to be released on January 10  Burra Venkatesham announces fast result declaration for Group-2 exams  TGPSC Group 2 Answer Key News in Telugu  TGPSC Chairman Burra Venkatesham announces Group-2 examination key release  TGPSC Chairman Burra Venkatesham talks about results release timeline  Burra Venkatesham announces fast result declaration for TGPSC exams

జ‌న‌వ‌రి 8న‌ వెంకటేశం మీడియాతో చిట్‌చాట్‌ మాట్లాడారు. ‘గతంలో జరిగిన తప్పిదాలు కమిషన్‌లో ఇకపై జరగవు. ఫలితాలు ఎప్పుడు వస్తాయో తెలియక అభ్యర్థులు సతమతమవుతున్నారు.

ఇకపై వేచి చూసే ధోరణి ఉండదు.ప్రతీ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఏళ్ల తరబడి వేచి చూడకుండా ప్రతి ఏడాది పరీక్షలు జరగాలన్నది మా నిర్ణయం.

చదవండి: Govt Job Notifications : యువ‌త‌కు గుడ్ న్యూస్‌.. త్వ‌ర‌లోనే జాబ్ నోటిఫికేష‌న్స్.. గ్రూప్స్ ఫ‌లితాల‌పై క్లారిటీ..!!

టీజీపీఎస్సీని పూర్తి స్థాయి ప్రక్షాళన చేస్తున్నాం.సైంటిఫిక్ డిజైన్ ఇక్కడ లోపించింది అందుకే ప్రక్షాళన చేస్తున్నాం.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను ఆయా శాఖకు సంబంధించిన అధికారులు చూస్తారు. ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న అన్ని పరీక్షల ఫలితాలు మార్చి 31కల్లా విడుదల చేస్తున్నాం.పెండింగ్ అనేది ఉండదు’అని వెంకటేశం తెలిపారు. 

Published date : 09 Jan 2025 01:02PM

Photo Stories