Skip to main content

TSPSC Group 2 Paper 1 Question Paper 2024 : గ్రూప్‌–2 పేప‌ర్-1 కొశ్చ‌న్ పేప‌ర్ ఇదే.. ఈ సారి ప్ర‌శ్న‌లు ఎలా వ‌చ్చాయంటే...?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ 783 గ్రూప్‌-2 పోస్టుల‌కు డిసెంబ‌ర్ 15వ తేదీ ఉద‌యం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేప‌ర్‌-1 ప‌రీక్ష‌ను నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో 1,368 పరీక్షా కేంద్రాల్లో ఈ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు.
TSPSC Group 2 Paper 1 Question Paper With Key 2024

ఈ గ్రూప్-2 పరీక్షకు మొత్తం 5.57 లక్షల మంది అభ్యర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. అలాగే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 ఉంటుంది. గ్రూప్-2 ప్రతి పేపరులో 150 ప్రశ్నలు 150 మార్కులకు నిర్వహిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో సాక్షి ఎడ్యుకేష‌న్ ప్ర‌త్యేకంగా.. గ్రూప్‌–2 కొశ్చ‌న్ పేప‌ర్-1ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. 

అలాగే కీ కూడా..
సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ ప్ర‌త్యేకంగా TSPSC Group-2 ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన పేప‌ర్‌-1 'కీ' ని ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణుల‌తో ప్రిపేర్ చేయిస్తున్నారు. ఈ కీ www.sakshieducation.com వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ కీ కేవ‌లం ఒక అవ‌గాహ‌న కోసం మాత్రమే. అంతిమంగా తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ విడుద‌ల చేసే కీ మాత్ర‌మే మీరు ప్రామాణికంగా తీసుకోగ‌ల‌రు.

ఎక్కువగా ప్ర‌శ్న‌లు..

గ్రూప్‌-2 పేపర్-1 ప్రశ్నాపత్రంలో సినిమాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగారు. ఆస్కార్‌ పురస్కారాలు 2024 కు సంబంధించి కింది వ్యాఖ్యలతో ఏవి ఒప్పు? అనే ప్ర‌శ్న‌లు అడిగారు. అలాగే 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు, 2024 నకు సంబంధించి ఈ క్రింది వాటిని జతపరచండి. అనే ప్ర‌శ్న కూడా అడిగారు. ఇటీవ‌ల జ‌రిగిన వివిధ‌ ప‌రిణామాల‌పై క‌రెంట్ అఫైర్స్ రూపంలో వివిధ ప్ర‌శ్న‌లు అడిగారు. ఇంకా గ్రూప్‌-2 పేప‌ర్‌-1లో ఎలాంటి ప్ర‌శ్న‌లు అడిగారు అని తెలుసుకోవాల‌నుకుంటే... కింద ఇచ్చిన Question Paperలో చూడొచ్చు.

TSPSC గ్రూప్‌–2 కొశ్చ‌న్ పేప‌ర్-1 కొశ్చ‌న్ పేప‌ర్ 2024 ఇదే.. ఈ సారి ప్ర‌శ్న‌లు ఎలా వ‌చ్చాయంటే...

Published date : 15 Dec 2024 02:57PM
PDF

Photo Stories