Skip to main content

TGPSC Group-2 Exam Instructions: గ్రూప్‌-2 అభ్యర్థులకు అలర్ట్‌.. ఇవి అస్సలు మర్చిపోవద్దు..

తెలంగాణలో లక్షల మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న గ్రూప్‌ 2 పరీక్షలు డిసెంబర్‌ 15, 16 తేదీల్లో జరుగనున్నాయి. రెండు రోజుల్లో నాలుగు సెషన్లలో గ్రూప్–2 పరీక్షలు జరుగుతాయి. ఇందు కోసం రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో 1,368 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. డిసెంబర్ 9 నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్స్‌ అందుబాటులో ఉంటాయి.కాగా, 783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటీఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. గ్రూప్-2 పరీక్షకు మొత్తం 5.57 లక్షల మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. త్వరలోనే గ్రూప్‌-2 పరీక్ష నేపథ్యంలో అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక సూచనలు చేసింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
TGPSC Group-2 Exam Instructions  Telangana Group-2 exam instructions for candidates  TGPSC Group-2 exam date announcement  Important instructions for Telangana Group-2 candidates
TGPSC Group-2 Exam Instructions

☛ డిసెంబర్‌9 నుంచే హాల్‌టికెట్స్‌ అందుబాటులోకి ఉంటాయి.. హాల్‌టికెట్‌ లేకపోతే పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
☛ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయి. 
☛ ఉదయం 8.30 గంటల కల్లా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి.. ఉ.9.30 తర్వాత లోపలికి అనుమతించరు
☛ మధ్యాహ్నం 1.30 గంటలలోగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. మ.2.30 తర్వాత అనుమతించారు. 

Sr. Knowledge Manager Recruitment 2024: సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నన్స్‌లో పోస్టులు.. చివరి తేదీ ఇదే

☛ ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ గుర్తింపుకార్డును వెంటతీసుకెళ్లాలి. అభ్యర్థులు హాల్‌టికెట్‌లో ఇచ్చిన పరీక్ష నిబంధనల గురించి క్షుణ్నంగా చదవాలి. వాటిని పాటించాల్సిందే.

☛ పరీక్ష కేంద్రాన్ని చివరిక్షణంలో వెత్తుక్కోవడం కన్నా.. ముందుగానే పరీక్ష కేంద్రం ఎక్కడ ఉందో చూసుకోవడం మంచిది.
☛ హాల్‌టికెట్ మీద ఫోలో స్పష్టంగా లేనివారు, ఫోటో చిన్నగా ఉన్నవారు, ఫోట్ లేనివారు, సంతకం లేనివారు పరీక్షకు వచ్చేప్పుడు 3 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలను వెంటతీసుకెళ్లాలి. గెజిటెడ్ ఆఫీసర్‌తో అటెస్టేషన్‌తోపాటు అండర్‌టేకింగ్ తీసుకోవాలి. దాన్ని పరీక్ష కేంద్రంలోని ఇన్విజిలేటర్‌కు సమర్పించాలి. అలా కాని పక్షంలో పరీక్షకు అనుమతించరు.

PwD అభ్యర్థుల కోసం:

☛ వికలాంగులు తమ SADARAM సర్టిఫికేట్ లేదా APPENDIX-III ని ప్రాధమిక సూపరింటెండెంట్‌కు తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. అప్పుడే వారు కంపన్సేటరీ టైంని పొందొచ్చు. 

Airports Authority of India Notification: ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పోస్టులు.. అప్లై చేశారా?


వెంట తెచ్చుకోవాల్సినవి..

☛ హాల్‌ టికెట్, బ్లూ లేదా బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్‌. ఆధార్‌ కార్డు లేదా ఏదైనా గుర్తింపు కార్డు (పాస్‌ పోర్టు, పాన్‌ కార్డు, ఓటర్‌ ఐడీ కార్డు, ప్రభుత్వ సంస్థ గుర్తింపు కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌). మరిన్ని వివరాలను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందవచ్చు.

☛ హాల్‌టికెట్‌లో ఫొటో సరిగాలేని వారు, సంతకం లేకుండా ఫొటో ఉన్నవారు పరీక్షకు 3 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలను తీసుకెళ్లాలి. గెజిటెడ్ ఆఫీసర్ ద్వారా అటెస్టేషన్ చేయించాలి.
☛ పరీక్ష రాసేముందు ప్రశ్నపత్రం బుక్‌లెట్‌లో ఇచ్చిన సూచనలను జాగ్రత్తగా చదవాలి.


 
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

☛ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు చైన్లు, చేతి గడియారాలు, ఆభరణాలు, షూస్‌ ధరించొద్దని, చివరకు పర్సు కూడా లోపలికి తీసుకురావద్దని సూచించింది. ఎలాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు, ట్యాబ్స్, పెన్‌డ్రైవ్‌లు, బ్లూటూత్, కాలిక్యులేటర్లు, మొబైల్‌ ఫోన్లు తెచ్చుకోవద్దని స్పష్టం చేసింది. 

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 09 Dec 2024 10:55AM
PDF

Photo Stories