Skip to main content

Velichala Jagapathirao History : గ్రూప్‌-2 లో వెలిచాల జ‌గ‌ప‌తిరావు పేరుపై రెండు ప్ర‌శ్న‌లు.. ఆ చ‌రిత్ర ఇదే..!

రాష్ట్రవ్యాప్తంగా 783 పోస్టులకు భ‌ర్తీకి నిర్వ‌హించిన‌ గ్రూప్ 2 పరీక్షకు 5 లక్షల 51 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో కేవ‌లం 50 శాతం అభ్య‌ర్థులు మాత్ర‌మే హాజ‌రైయ్యారు.
Velichala jagatathi rao history in tgpsc group 2 questions

సాక్షి ఎడ్యుకేష‌న్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల‌పాటు జరిగిన టీజీపీఎస్సీ గ్రూప్‌-2 ప‌రీక్ష‌లు ప్ర‌శాంతంగా ముగిశాయి. అయితే, రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో నిర్వహించిన ఈ ప‌రీక్ష‌ల‌కు ఈసారి 50 క‌న్నా త‌క్కువ శాతంలో అభ్య‌ర్థులు హాజ‌రు కావ‌డం చ‌ర్చినియాంశంగా మారింది. కాగా, కరీంనగర్‌లో రెండో రోజు పరీక్షలకు కేవ‌లం 49 శాతం అభ్య‌ర్థులు మాత్ర‌మే హాజరయ్యారు.

TGPSC Group 2 Exam: పురిటి నొప్పులు భరిస్తూ.. పరీక్ష రాసి.. పరీక్ష రాస్తుండగానే ఇలా..

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఆధ్వర్యంలో జరిగిన గ్రూప్‌-2 పరీక్షలో కరీంనగర్ కు చెందిన వెలిచాల జగపతిరావు పేరును ప్రస్తావించడం అరుదైన విషయం. ఆయ‌న‌ పేరు మీద గ్రూప్ 2లో రెండు ప్రశ్నలు వచ్చాయి. నాలుగో పేపర్ లో 52వ ప్రశ్నగా ఎవరి ఆధ్వర్యంలో 'తెలంగాణ శాసన సభ్యుల ఫోరం' ఏర్పడింది అని ప్రశ్న అడిగారు.

1992లో ఈ డిమాండ్‌తో..

తెలంగాణ ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో 1992లో వెలిచాల జగపతిరావు కన్వీనర్ గా, జానారెడ్డి చైర్మన్ గా తెలంగాణ శాసన సభ్యుల ఫోరాన్ని ఏర్పాటు చేసి అన్ని పార్టీలకు చెందిన 92 మంది ఎమ్మెల్యేల సంతకాలతో అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావుకు వినపతిపత్రం సమర్పించారు. అలాగే 55వ ప్రశ్నగా 'వెలిచాల జగపతి రావుకు సంబంధించి కింది వ్యాఖ్యలను పరిగణించండి అనే ప్రశ్న ఇచ్చారు.

TGPSC Group 2 Exam: ఆంధ్రా రియల్‌ ఎస్టేట్‌.. టీడీపీ విజన్‌ డాక్యుమెంట్‌.. సంబంధం లేని ప్రశ్నలు

మూడు రోజుల స‌ద‌స్సు..

1989 లో ఆయన కరీంనగర్ లో తెలంగాణపై మూడు రోజుల సదస్సు నిర్వహించడం, దుశర్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన జల సాధన సమితి ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడం ఆయనకు సంబంధించి వ్యాఖ్యల్లో సరైనవని ఆయన కుమారుడు, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ ఇన్చార్జీ వెలిచాల రాజేందర్ రావు వెల్లడించారు.

గ్రూప్‌-2 ప‌రీక్ష‌తో

1989లో తెలంగాణ ఆవశ్యకతపై మూడు రోజుల సదస్సు నిర్వహించి మలిదశ ఉద్యమానికి తన తండ్రి అంకురార్పణ చేశారని గుర్తు చేశారు. గ్రూప్ 2లో ప్రశ్నలు ఇవ్వడం ద్వారా తన తండ్రి త్యాగాన్ని, ఆయన పోరాట చరిత్రను ఈ తరానికి తెలియజేసినందుకు టీజీపీఎస్సీ బాధ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో తన తండ్రి జగపతిరావు ప్రముఖంగా వ్యవహరించారని గుర్తు చేశారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

అత్యుత్త‌మ సేవ‌లు..

1972-77 వరకు ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర మార్క్ ఫెడ్ చైర్మన్ అత్యుత్తమ సేవలందించారు. 1972లో జగిత్యాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ పై ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1978-84 వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీగా పని చేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమ నేత మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతిరావు నీతికి నిజాయితీకి మారుపేరని తెలిపారు.

కాగా, వ‌చ్చే ఏడాది.. అంటే మార్చి 2025 చివ‌రిలో గ్రూప్‌-1, 2, 3 ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన ఫ‌లితాల‌ను విడుద‌ల అవుతాయని వెల్ల‌డించారు టీజీపీఎస్సీ చైర్మ‌న్ బుర్ర వెంక‌టేశం.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 17 Dec 2024 02:27PM

Photo Stories