TGPSC Group 2 Candidates : అసౌకర్య ఏర్పాట్లు.. ఇటువంటి కేంద్రాలు ఎందుకు..?
సాక్షి ఎడ్యుకేషన్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్-2 పరీక్షలను డిసెంబర్ 15, 16వ తేదీల్లో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే, డిసెంబర్ 15, ఆదివారం రెండు పేపర్లను నిర్వహించారు. నేడు, అంటే.. డిసెంబర్ 16వ తేదీన మరో రెండు పేపర్లను నిర్వమించనున్నారు. ఈ రెండు పేపర్లను ఉదయం ఒకటి, మధ్యాహ్నం మరొకటి జరుగుతుంది.
TGPSC Group 2 : అత్యంత కఠినంగా గ్రూప్-2 ప్రశ్నలు.. ఈసారి హాజరు శాతం కేవలం..
అరకిలో మీటర్ దూరంగా..
ఇదిలా ఉంటే, ప్రతీ అభ్యర్థి తమ కేంద్రానికి అరగంట ముందే చేరుకోవాలని నిబంధన ఉంది. అయితే, ఒక కేంద్రంలో మాత్రం అభ్యర్థులు, వారి కూడా వచ్చిన వారంతా ఖచ్చితంగా పరీక్ష కేంద్రం నుంచి అరకిలో మీటర్ దూరంగా ఏర్పాటు చేసిన పార్కింగ్ వద్ద వారి వాహనాలను నిలపాలని అక్కడి అధికారులు, పోలీసులు ఆదేశించారు. అభ్యర్థులు అంత దూరం వరకు వెళ్లి తిరిగి కేంద్రానికి వచ్చే సరికి సమయం ఎక్కువైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
కేంద్రం శాపంగా..
మొయినాబాద్‌లోని కెజి.రెడ్డి, గ్లోబల్ ఇంజినీరింగ్ కళాశాలల్లో టీజీపీఎస్సీ గ్రూప్-2 పరీక్షకు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే, ప్రతీ కేంద్రం వద్ద అభ్యర్థులు వారి వాహనాలను నిలిపేందుకు పార్కింగ్‌కు స్థలం ఉంటుంది కాని, ఈ కాలేజీలో మాత్రం ఆ సౌకర్యం లేకపోగా, పోలీసులు అక్కడి నుంచి అర కిలోమీటర్ దూరంలో ఉన్న చోట పార్కింగ్ ఏర్పాటు చేశారు. దీంతో అభ్యర్థులు తెచ్చుకున్న వాహనాలను అక్కడే పార్క్ చేయాలని ఆదేశించారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
దీంతో తప్పక ప్రతీ ఒక్కరు అక్కడే తమ పార్కింగ్ చేశారు. దీంతో కొందరికి తిరిగి పరీక్ష కేంద్రానికి చేరుకోవడం ఆలస్యమైంది. ఇక్కడ కొందరు అభ్యర్థుల్ని అధికారులు లోపలికి వెళ్లనివ్వలేదు. ఆలస్యంగా వచ్చారని గేటు వద్దే ఆపేసారు. దీంతో అభ్యర్థులు వారి కూడా వచ్చిన కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో కూడా..
అసలు అక్కడ ఎలా పార్కింగ్ ఏర్పాటు చేస్తారని కొందరు, పార్కింగ్ లేని కళాశాలలో ఎలా పరీక్షను నిర్వహిస్తారని మరి కొందరు ప్రశ్నించారు. వాహనాలను పార్క్ చేసి తిరిగి కేంద్రానికి చేరుకునేసరికి 10 నిమిషాలు పడుతుంది. ఇక్కడే సమయం అంతా పోతే పరీక్షకు ఎలా సమయానికి చేరుకోగలం అంటూ ప్రశ్నించారు. దీని వల్ల వివిధ కారణాలతో చివరి నిమిషంలో పరీక్షా కేంద్రానికి చేరుకునే అభ్యర్థులు 'నిమిషం నిబంధన'కు బలై సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోలేని పరిస్థితి లేకపోలేదని, గతంలో అక్కడ జరిగిన పలు పోటీ పరీక్షలు, టీజీపీఎస్‌సీ పరీక్షలు రాసిన పలువురు అభ్యర్థులు ఈ అరకిలోమీటర్ నడక కారణంగా సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోలేని సందర్భాలున్నట్లు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.
నేనే స్వయంగా పరిశీలించాను.. డీసీపీ చింతమనేని శ్రీనివాస్
కెజి.రెడ్డి, గ్లోబల్ ఇంజినీరింగ్ కళాశాలలు ఇరుకైన సందులో ఉండటం, అక్కడ సరైన పార్కింగ్ స్థలం లేకపోవడం వల్లనే వాహనాలను కొంత దూరంలో పార్కింగ్ చేయిస్తున్నాం. ఈ రెండు పరీక్షా కేంద్రాలు ఇరుకైన సందులో ఉండటం, అక్కడ పార్కింగ్ స్థలం లేకపోవడంతో అభ్యర్థులందరూ ఒక్కసారిగా వాహనాలతో వస్తే తీవ్ర ట్రాఫిక్‌జామ్ ఏర్పడే అవకాశముంది. దీంతో అభ్యర్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోలేరు. అందుకని వారికి ట్రాఫిక్ ఆటంకాలు ఏర్పడకూడదనే అభ్యర్థుల వాహనాలను పరీక్షా కేంద్రాలకు కొంత దూరంలోనే నిలిపివేస్తున్నాం.
పరీక్షకు గంట ముందుగా వచ్చిన అభ్యర్థుల వాహనాలను మాత్రమే దూరంగా పార్క్ చేయిస్తున్నాం.. ఆలస్యంగా వచ్చిన అభ్యర్థుల వాహనాలను మాత్రం పరీక్షా కేంద్రం వరకు అనుమతిస్తున్నాం. అవసరమైతే స్వయంగా తమ సిబ్బందితో పోలీసు వాహనాల్లో పరీక్షా కేంద్రాలకు చేరవేసేలా చర్యలు చేపట్టాం. రాజేంద్రనగర్ జోన్ పరిధిలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో ఆదివారం గ్రూప్-2 పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఉదయం నుంచి నేను స్వయంగా పరీక్షా కేంద్రాలను సందర్శించి, అభ్యర్థులకు ఇబ్బందులు కలుగకుండా పర్యవేక్షించాను. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద సంబంధిత ఠాణాకు చెందిన సీఐ, ఎస్‌ఐ స్థాయి అధికారులు బందోబస్తు చర్యలు నిర్వహిస్తున్నారు.
Tags
- TGPSC Group 2 Exam
- Telangana State Exams
- Competitive Exams
- group 2 exam centers
- group 2 exam center issues
- candidates issues with exam centers
- tgpsc group 2 exams centers issues news in telugu
- tgspc exams 2024
- vehicles parking issues
- group 2 candidates complaints
- Group 2 exam 2024
- exam centers for tgpsc group 2 exams
- tgpsc group 2 exams updates in telugu
- Police department
- Telangana Govt
- government exams and jobs
- State Exams
- competitive exams in telangana
- telangana public service commission
- TGPSC Group 2 Exam Details in Telugu
- group exams in telangana
- Education News
- Sakshi Education News