Skip to main content

TSPSC Group 2 Exam Attendance 2024 : షాకింగ్ న్యూస్‌.. గ్రూప్‌-2 ప‌రీక్ష‌కు తొలి రోజు స‌గం మందికి పైగా...

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ 783 గ్రూప్‌-2 పోస్టుల‌కు డిసెంబ‌ర్ 15వ తేదీ ఉద‌యం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేప‌ర్‌-1 ప‌రీక్ష‌ను నిర్వహించారు. అలాగే ఇదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 జ‌రిగింది.
TSPSC Group 2 Exam Attendance 2024 News in Telugu

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో 1,368 పరీక్షా కేంద్రాల్లో ఈ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించారు. అయితే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 2 పరీక్షలకు తొలిరోజు దారుణంగా సగంమంది కంటే ఎక్కువగానే గైర్హాజరు అయ్యారు. గ్రూప్ 2 తొలిరోజు పేపర్ –1 కు 46.75% (2,57,981 మంది), పేపర్–2 కు 46.30% (2,55490 మంది) మాత్ర‌మే హజరయ్యారు.

☛➤ TSPSC Group-2 Question Paper 1 With Key 2024 : గ్రూప్‌–2 పేప‌ర్-1 కొశ్చ‌న్ పేప‌ర్ & కీ ఇదే.. ఈ సారి ప్ర‌శ్న‌లకు స‌మాధానాలు ఇవే...

ఈ నోటీపికేషన్‌కు మొత్తం 5,51,855 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో కేవలం 74.96% మందే హల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. అలాగే ఇటీవలే నిర్వహించిన గ్రూప్–3 పరీక్షలకు కూడా ఇదే విధంగా సగంకంటే తక్కువగానే అభ్యర్థులు హాజ‌ర‌య్యారు.

☛➤ TSPSC Group 2 Paper 2 Question Paper 2024 : గ్రూప్‌–2 పేప‌ర్-2 కొశ్చ‌న్ పేప‌ర్ ఇదే.. ఈ సారి ప్ర‌శ్న‌లు ఎలా వ‌చ్చాయంటే...?

గ్రూప్‌-2 ప‌రీక్ష‌కు తొలి రోజు స‌గం మందికి పైగా...

TSPSC Group2 Exam 2024

Published date : 15 Dec 2024 11:16PM

Photo Stories