TGPSC Group 2 Exam: గ్రూప్–2లో ఉమ్మడి జిల్లా ప్రస్తావన.. పేపర్ –4లోనూ..

పేపర్ –4లోనూ..
పేపర్–4లో దాదాపు 10 వరకు ప్రశ్నలు పాత జిల్లా ప్రస్తావన అధికంగా కనిపించింది. పేపర్–4లో చొక్కారావు– తెలంగాణ హక్కుల రక్షణ సమితి అధ్యక్షుడిగా పనిచేశారా? అని 29 ప్రశ్నగా అడిగారు. బెజ్జంకి జాతరలో లక్ష్మీనరసింహస్వామి గురించి 48వ ప్రశ్నకింద అడిగారు.
మాజీ ఎమ్మెల్యే జగపతిరావు రాజకీయ ప్రస్థానంలో మైలురాళ్లపై 68వ ప్రశ్నగా ఇచ్చారు. తెలంగాణ సభ్యుల ఫోరం ఎవరి ఆధ్వర్యంలో ఏర్పడిందన్న సందర్భంలో మరోసారి వెలిచాల జగపతిరావు పేరును ప్రస్తావించడం విశేషం.
సిరిసిల్ల, జగిత్యాల తాలూకాలను 1978లో కల్లోలిత ప్రాంతాలుగా పరిగణించారు అని 83వ ప్రశ్నలో చర్చించారు. 84వ ప్రశ్నలో జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో వ్యవసాయ కార్మికుల సమావేశం, మంథనిలో కొండపల్లి సీతారామయ్య గ్రామాలకు వెళ్లండి.. అని విద్యార్థులకు ఇచ్చిన పిలుపు గురించి అడిగారు.
చదవండి: TGPSC Group 2 Exam: గ్రూప్–2 పరీక్షలో నిర్మల్ ప్రస్తావన.. ప్రశ్న ఇదే..
తాడిచర్ల మండలం అధ్యక్షుడు మల్హర్‌రావును అప్పటి పీపుల్స్‌వార్(ప్రస్తుత మావోయిస్ట్) పార్టీ హత్య చేసిన విషయాన్ని 91వ ప్రశ్నలో అడిగారు. 93వ ప్రశ్నలో 1978లో జగిత్యాల జైత్రయాత్ర విశేషాల గురించి ప్రస్తావించారు. 102లో కరీంనగర్ ప్లార్లమెంట్‌కు ఎన్నికై న టీఆర్‌ఎస్ నాయకుల పేర్లు అడిగారు. టీఆర్‌ఎస్ కరీంనగర్ కదనభేరీ పేరిట నిర్వహించిన సభపై 131వ ప్రశ్నగా అడిగారు.
116వ ప్రశ్నలో మాజీ ఎంపీ వినోద్ కుమార్ ప్రస్తావన వచ్చింది. ఇక పేపర్–3లో పేద జిల్లాలను గుర్తించే క్రమంలో కరీంనగర్ ప్రస్తావన 78వ ప్రశ్నలో, పంట వైవిధ్యంపై ప్రస్తావించిన క్రమంలో పెద్దపల్లి చర్చ 85వ ప్రశ్నగా, వరి సాగు విస్తీర్ణం విషయంలో 85వ ప్రశ్నలో చర్చించారు.
రాజకీయ నేతలు చొక్కారావు, వెలిచాల జగపతిరావు, మల్హర్‌రావు, వినోద్‌కుమార్ ప్రస్తావన, జగిత్యాల జైత్రయాత్ర, సిరిసిల్లలో టీఆర్‌ఎస్ సభ, రైతు పోరాటాలు, మంథనిలో పీపుల్స్‌వార్ కార్యకలాపాలపై ప్రశ్నలు పాతజిల్లా జ్ఞాపకాలను తట్టిలేపాయి. నాటి ఘటనలు నేటి యువత చరిత్రగా చదువుకుంటున్న తీరును సీనియర్ సిటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Tags
- group 2
- TGPSC Group 2
- Karimnagar District
- TGPSC Group 2 Exam Questions
- Telangana Movement
- Group 2 Exam Paper 4
- Chokka Rao
- Telangana Rights Protection Samiti
- Bejjanki Jathara
- Jagapathi Rao
- Telangana Members Forum
- Telangana Questions
- Telangana News
- TelanganaExams
- TelanganaPolitics
- TelanganaMovement
- TelanganaHistory
- KarimnagarDistrict