Skip to main content

Free Coaching: ఎస్‌ఆర్టీఆర్‌ఐలో స్వయం ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణ

భూదాన్‌ పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లి మండలంలోని జలాల్‌పురం స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థ (ఎస్‌ఆర్టీఆర్‌ఐ)లో కేంద్ర ప్రభుత్వ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకం కింద స్వయం ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ డైరెక్టర్‌ పీఎస్‌ఎస్‌ఆర్‌ లక్ష్మి జ‌న‌వ‌రి 8న‌ ఒక ప్రకటనలో తెలిపారు.
Free Training in Self Employed Courses at SRTRI

మూడున్నర నెలల కాల వ్యవధి కలిగిన బేసిక్‌ కంప్యూటర్స్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్‌ కోర్సుకు ఇంటర్మీడియట్, అకౌంట్‌ అసిస్టెంట్‌ (ట్యాలీ) కోర్సుకు బీకాం, కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ అసిస్టెంట్‌ కోర్సుకు ఇంటర్మీడియట్, ఆటోమొబైల్‌ టూవీలర్‌ కోర్సుకు పదో తరగతి పాసై ఉండాలని సూచించారు.

చదవండి: Free Swayam Courses: ఉచిత కోర్సుల వేదిక.. స్వయం!.. స్వయం ప్రత్యేక కోర్సులు ఇవే..

అభ్యర్థులు 18–30 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలని, శిక్షణ కాలంలో ఉచిత భోజనంతో కూడిన హాస్టల్‌ వసతి కల్పిస్తామని వెల్లడించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు విద్యార్హతల సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలతో ఈనెల 16న సంస్థలో నిర్వహించే కౌన్సెలింగ్‌కు నేరుగా హాజరుకావాలన్నారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ఇతర వివరాలకు 9133908000, 9133908111 ఫోన్‌నంబర్లలో సంప్రదించాలని సూచించారు.  

Published date : 09 Jan 2025 03:17PM

Photo Stories