CBSE Releases Career Guide: పది తర్వాత.. ఎలాంటి కోర్సు, కెరీర్ ఎంపిక చేసుకోవాలి? CBSE కెరీర్ గైడ్ రిలీజ్
Sakshi Education
పదో తరగతి.. ప్రతి విద్యార్థి జీవితంలో ఇది ఎంతో కీలకమైన దశ. టెన్త్ తర్వాత ఏం చేయాలి?ఏ కోర్సు ఎంచుకుంటే బావుంటుంది అన్న సందేహం చాలా మంది విద్యార్థులు, తల్లిదండ్రుల్లోనూ ఉంటుంది. ఈ సందిగ్ధతను నివృత్తి చేసేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) కెరీర్ గైడ్‌ను విడుదల చేసింది.
CBSE Releases Career Guide CBSE Releases Career Guide For Parents To Help Students Plan Their Future
టెన్త్ తర్వాత ఎలాంటి కెరీర్ అవకాశాలు ఉంటాయి?ఇంజనీరింగ్, మెడిసిన్, లా, మేనేజ్‌మెంట్, డిజైన్, సైన్స్, ఆర్ట్స్, హ్యూమానిటీస్ తదితర రంగాల్లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి వంటి వాటి గురించి వివరించారు. దీంతో పాటు ప్రవేశ పరీక్షల వివరాలు, ఉన్నత విద్య కోసం అవసరమైన పుస్తకాల వివరాలను సైతం ఇందులో వివరించారు. మరింత సమాచారం కోసం సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్ cbse.gov.inను సంప్రదించవచ్చు.