Skip to main content

CBSE: ఈ పరీక్షల్లో కాలిక్యులేటర్‌కు అనుమతి

సాక్షి, హైదరాబాద్‌: సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (CBSE) కీలక నిర్ణయం తీసుకుంది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి 12వ తరగతి పరీక్షల్లో బేసిక్‌ కాలిక్యులేటర్‌ వాడటానికి అనుమతి ఇవ్వనుంది. ఇది సాధారణ కూడికలు, తీసివేతలు, భాగహారాలకు సంబంధించిన ప్రాథమిక ఫంక్షన్లు మాత్రమే నిర్వహించగల కాలిక్యులేటర్‌ అయి ఉండాలి. అధునాతన ఫీచర్లు గల కాలిక్యులేటర్‌లను అనుమతించరు.
Calculator allowed in CBSE Class 12 exams

ఆన్‌స్క్రీన్‌ మార్కింగ్‌ (OMS) ద్వారా డిజిటల్ మూల్యాంకనం

సీబీఎస్‌ఈ ఇకనుంచి ఆన్‌స్క్రీన్‌ మార్కింగ్‌ (OMS) విధానాన్ని అమలు చేయనుంది. ప్రశ్నపత్రాలను స్కాన్‌ చేసి, ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ద్వారా మూల్యాంకనం చేస్తారు. దీని వల్ల ఫలితాలు త్వరగా వెల్లడించడంతో పాటు మూల్యాంకనలోని తప్పులను సాఫ్ట్‌వేర్‌ గుర్తించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రముఖ సబ్జెక్టులైన సైన్స్‌, మాథ్స్‌ సప్లిమెంటరీ పరీక్షలకు ఇది పైలెట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నారు.

సబ్జెక్టుల్లో నైపుణ్య అభివృద్ధి – పారిశ్రామిక భాగస్వామ్యంతో

సీబీఎస్‌ఈ 2026-27 విద్యా సంవత్సరం నుంచి నైపుణ్యాభివృద్ధిని సబ్జెక్టులతో మేళవించే విధానాన్ని తీసుకురానుంది. పారిశ్రామిక భాగస్వామ్యంతో విద్యార్థులు చదివే సమయంలోనే నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునేలా ఏర్పాట్లు చేయనుంది. టెన్త్‌ తరగతి నుంచే ఈ విధానాన్ని ప్రవేశపెట్టనుంది.

చదవండి: 1161 Jobs: పదోతరగతి అర్హతతో సీఐఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్‌ కొలువులు.. ఎంపిక విధానం ఇలా!

సైన్స్, సోషల్‌ సబ్జెక్టులకు కొత్త మూల్యాంకన విధానం

పాఠశాల స్థాయిలో సైన్స్‌, సోషల్‌ సబ్జెక్టుల మూల్యాంకన విధానాన్ని పునఃపరిశీలించి, గమనించే తీరులో మార్పులు తేవాలని నిర్ణయించింది. పాఠం పూర్తయ్యే రోజే పరీక్షలు నిర్వహించి, లోతైన ప్రశ్నలతో రీజనింగ్‌ అంశాలను పరిగణనలోకి తీసుకురానుంది.

ముఖ్యమైన తేదీలు

కాలిక్యులేటర్‌ అనుమతి: 2025-26 విద్యా సంవత్సరం నుంచి

నైపుణ్య అభివృద్ధి విధానం: 2026-27 విద్యా సంవత్సరం నుంచి

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 25 Mar 2025 11:50AM

Photo Stories