Top 10 CBSE Students Doubts : టాప్ 10 ప్రశ్నలకు సీబీఎస్ఈ సమాధానాలు.. విద్యార్థుల సందేహాలు ఇలా..

సాక్షి ఎడ్యుకేషన్: సీబీఎస్ఈ విద్యార్థులకు త్వరలోనే టెన్త్, ఇంటర్ విద్యార్థులకు బోర్డు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంలో విద్యార్థులకు సాధారణమైనా అనుమానాలు రావడం సహజమే. ప్రతీ చిన్న విషయాలన్ని తెలుసుకోవాలనుకుంటారు. ప్రతీ సందేహాన్ని తీర్చుకోవాలని ప్రయత్నిస్తారు.
అయితే, విద్యార్థులు పరీక్షలకు ముందు ఎలాంటి సందేహాలతో ఇబ్బందులు ఎదుర్కోకూడదని, ప్రతీ విద్యార్థి పూర్తి శ్రద్ధతో పరీక్ష రాయాలని సీబీఎస్ఈ తమ అధికారిక వెబ్‌సైట్‌లో పలు ఫెఏక్యూలకు సమాధానాలు ప్రకటించింది. దీంతో, విద్యార్థుల సందేహాలు చాలావరకు తీరే అవకాశాలు ఉన్నాయి. ఒక్కసారి ఆ ప్రశ్నలు, సమాధాలు ఏంటో పరిశీలిద్దాం..
↪ ప్రీ-బోర్ట్‌లో ఫెయిల్ అయితే బోర్డు పరీక్షకు అనుమతి ఉండదా?
ప్రీ-బోర్డు పరీక్షల్లో విద్యార్థుల ప్రదర్శన.. సీబీఎస్ఈ క్లాస్ 10, 12 బోర్డు పరీక్షకు ఎంత బాగా సన్నద్ధమయ్యారో తెలుసుకోవడానికి సహాయపడతాయి. పరీక్ష రాసేందుకు అర్హత ఉంటే బోర్డు పరీక్షకు హాజరుకాకుండా ఒక విద్యార్థిని అడ్డుకోలేరు.
↪ లాంగ్వేజ్ పేపర్లలో పద పరిమితి, అక్షర దోషాలకు మార్కులు దగ్గిస్తారా?
పరీక్షలో పద పరిమితి దాటితే ఎలాంటి మార్కులు తగ్గించరు. కాని, అక్షర దోషాలు, ఇతర తప్పులకు లాంగ్వేజ్ పేపర్లలో మార్కుల కోత ఉంటుంది.
Good News for Tenth Students : విద్యార్థులకు గుడ్ న్యూస్.. సర్కార్ కీలక ఆదేశాలు..!!
↪ సిలబస్ మొత్తాన్ని చాలా మంది 2-3 సార్లు రివైజ్ చేస్తున్నారు. నేను చేయలేదని భయంగా ఉంది. ఎలా?
ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు భయాందోళనకు గురికావద్దు, కేవలం ప్రిపరేషన్ పైనే దృష్టి పెట్టాలని బోర్డు సూచిస్తోంది. రోజువారీ టైమ్ టేబుల్ తయారు చేసుకోవాలిని, దాన్ని ఫాలో అవ్వాలని చెబుతోంది. పరీక్షల సమయంలో విద్యార్థులు ఎటువంటి భయం కాని, ఆందోళన కాని చెందకుండా, ప్రిపరేషన్ కొనసాగించాలి.
↪ విద్యార్థి రచనా వేగం మందగించి, పేపర్ పూర్తి చేయలేకపోతే?
రాత వేగాన్ని పెంచడానికి, విద్యార్థులు సమాధానాలు రాస్తూ ప్రిపేర్ అవ్వాలని సీబీఎస్ఈ సూచించింది. అంతేకాకుండా పరీక్ష సమయంలో ఏదైనా సమాధానం రాసే ముందు తమ ఆలోచనలను క్రమబద్ధీకరించుకుని సమయం తక్కువగా ఉంటే పాయింట్లలో సమాధానాలు రాయడానికి ప్రయత్నించాలి. వారు మొత్తం ప్రశ్నను విస్మరించకూడదు.
Inter Practical Exams 2025 : ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం.. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ ఇలా..
↪ బోర్డు పరీక్షల్లో వైట్నర్స్, జెల్ పెన్నులకు అనుమతి ఉందా?
బోర్డు పరీక్షలో వైట్నర్ ఉపయోగించడానికి అనుమతి లేదు. కాగా విద్యార్థులు నీలం లేదా రాయల్ బ్లూ ఇంక్ జెల్ పెన్నులను ఉపయోగించవచ్చు. పరీక్షలో విద్యార్థులు ఎలాంటి తప్పులు చేయకుండా ఉండేలా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. దీంతో, పరీక్ష రాసే సమయంలో తప్పులు జరగకుండా ఉంటాయి.
↪ మంచి ప్రజెంటేషన్‌కి ఏమైనా మార్కులు ఇస్తారా?
పరీక్షల్లో విద్యార్థుల ప్రజెంటేషన్‌కి ప్రత్యేక మార్కులు ఇవ్వనప్పటికీ, సమాధానాలు నీట్‌గా, ముఖ్యమైన అంశాలతో చక్కగా ఆర్గనైజ్డ్గా ఉండాలని సిఫార్సు చేశారు.
↪ పేపర్ లీక్ అంటూ కనిపించే వాటిని తీసుకోవచ్చా?
వదంతులు, ధృవీకరించని వార్తలను పట్టించుకోవద్దని బోర్డు విద్యార్థులకు గట్టిగా సూచిస్తోంది. పరీక్షల నిర్వహణకు బోర్డులో ఫూల్ ప్రూఫ్ విధానం ఉంది. విద్యార్థులకు తప్పుడు సమాచారం అందితే వెంటనే ఈ-మెయిల్ లేదా ఫోన్ ద్వారా బోర్డును సంప్రదించాలి.
Inter Board Exams Hall Tickets : ఇంటర్ విద్యార్థులకు బోర్డు అలర్ట్.. ఫోన్‌కే హాల్‌టికెట్లు..!!
↪ మంచి మార్కుల కోసం విద్యార్థులు ప్రిపేర్ అవ్వాల్సిన ముఖ్యమైన చాప్టర్లు ఏమైనా ఉన్నాయా?
పరీక్షల కోసం సెలెక్టివ్ స్టడీ చేయమని సీబీఎస్ఈ విద్యార్థులకు సలహా ఇవ్వదు. బోర్డు ప్రతి సబ్జెక్టులో సిలబస్‌ని నిర్దేశించింది. పరీక్షలో మంచి మార్కులు సాధించాలంటే విద్యార్థులు మొత్తం సిలబస్ నుంచి క్షుణ్ణంగా అధ్యయనం చేసి కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవాల్సిందే.
↪ బోర్డు పరీక్షల్లో ప్రీ-బోర్డ్ ఎగ్జామ్స్ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారా?
ప్రీ-బోర్డ్ పరీక్షలో పొందిన మార్కులు సీబీఎస్ఈ బోర్డు పరీక్ష మార్కులకు యాడ్ అవ్వవు.
↪ బోర్డు నమూనా పేపర్ నుంచి ప్రశ్నలు అడుగుతారా?
సీబీఎస్ఈ శాంపిల్ ప్రశ్నపత్రాలు విద్యార్థులకు ప్రశ్నల రూపకల్పన, ఐడియా తెలుసుకోవడానికి మాత్రమే సహాయపడతాయని బోర్డు పేర్కొంది. అయితే పరీక్షలో ప్రశ్నలు సిలబస్‌లోని ఏ భాగం నుంచైనా ఉండవచ్చు. కాబట్టి విద్యార్థులు మొత్తం సిలబస్‌ని క్షుణ్ణంగా ప్రిపేర్ కావాలని సూచించింది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- cbse students
- Board Exams
- students questions
- exams preparations for cbse
- students doubts for exams
- paper model for cbse students in board
- tenth and inter board exam paper model
- tenth and inter students faq's
- cbse students faq's for board exams
- students doubts regarding board exams 2025
- marks and presentation in board
- Education News
- Sakshi Education News
- CBSEBoardExams
- BoardExamPreparation
- ExamGuidelines