Board Exams Twice : ఇకపై రెండుసార్లు బోర్డు పరీక్షలు.. విద్యాశాఖ కీలక ప్రకటన.. ఎప్పటినుంచి!!

సాక్షి ఎడ్యుకేషన్: పదో తరగతి విద్యార్థులకు బోర్డు శుభవార్త తెలిపింది. బోర్డు పరీక్షల్లో ఒక మార్పు చేసినట్లు ప్రకటించారు. విద్యార్థులకు ఇకపై ప్రతీ ఏటా ఒకటి కాదు ఏకంగా రెండు సార్లు బోర్డు పరీక్షలు ఉంటాయని నిర్ణయించినట్లు తెలిపారు విద్యాశాఖ అధికారులు. జాతీయ విద్యా పరిశోధన సంగథన్, నవోదయ విద్యాలయ సమితి, కేంద్రీయ విద్యాలయ సంగటన్ కు చెందిన ఉన్నతాధికారులతో ఇటీవల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా, విద్యార్థులకు ఈ కీలక ప్రకటన చేశారు.
ఇకనుంచి రెండుసార్లు..
విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించే ప్రయత్నంలో భాగంగా సీబీఎస్ఈ పదో తరగతి విద్యార్థులకు ఇకనుంచి ప్రతీ ఏటా బోర్డు పరీక్షలను రెండు సార్లు నిర్వహించాలని నిర్ణయించారు అధికారులు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అంటే.. 2026 నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుంది. నూతన జాతీయ విధానం 2020 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు అధికారులు.
ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం..
ఈ నిర్ణయంతో, విద్యార్థులు పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించేందుకే ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ఈ సందర్భంగా ముసాయిదాలపై సంతకాలు కూడా చేశారు. ఈ నిర్ణయం.. విద్యార్థుల మార్కులు మెరుగుపర్చేందుకు, వారిలో ఒత్తిడిని తగ్గించేందుకు చేసే ప్రయత్నంలో తీసుకున్నది.
Good News for Tenth Students : విద్యార్థులకు గుడ్ న్యూస్.. సర్కార్ కీలక ఆదేశాలు..!!
ఈ విధానంలో, విద్యార్థులు రెండు సార్లు పరీక్షలు రాయడమే కాకుండా, వారికి నైపుణ్యాలు, సెల్ఫ్ డెవలప్‌మెంట్‌పై దృష్టి సారించవచ్చని విద్యార్థులను ప్రోత్సాహిస్తూ మాట్లాడారు.
దీంతో, అదనంగా.. 2026-27 విద్యాసంవత్సరంలో సీబీఎస్ఈ పరిధిలోని 260 విదేశీ పాఠశాలల్లోనూ గ్లోబల్ సిలబస్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు విద్యాశాఖ అధికారులు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- CBSE
- Tenth board exams
- twice board exams for cbse
- good news for cbse students
- central government
- cbse board exams
- good news for tenth cbse students
- Academic year
- Central Education Department
- students education
- self confidence and skills development
- academic year 2026
- twice board exams in cbse 10th
- cbse 10th board exams 2026
- cbse tenth board exams twice 2026
- cbse latest news in telugu
- cbse board exams latest updates in telugu
- twice board exams for cbse tenth students news in telugu
- Education News
- Sakshi Education News