Good News for Tenth Students : విద్యార్థులకు గుడ్ న్యూస్.. సర్కార్ కీలక ఆదేశాలు..!!

సాక్షి ఎడ్యుకేషన్: టెన్త్ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. మార్చిలో పదో తరగతి విద్యార్థులకు బోర్డు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మెరకు ఒక కీలక ఆదేశాన్ని ప్రభుత్వం ఇటీవల జారీ చేసింది. విద్యార్థులకు పరీక్షలు ముగిసేవరకు ప్రతీ ప్రభుత్వ పాఠశాలలోని పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు సాయంత్రం సమయంలో స్నాక్స్ పెట్టాలని, ఈ మేరకు అన్ని జిల్లాల డీఈవోలకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నర్సింహారెడ్డి 2025, జనవరి 29న ఆదేశాలు జారీ చేశారు. 2025 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మార్చి 20 వరకు మొత్తం 38 వర్కింగ్ డేస్ స్నాక్స్ ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Lack of Teachers : మూడు రోజుల నుంచి టీచర్ల కొరత.. అధికారులు స్పందించాలని డిమాండ్..
ప్రిపరేషన్‌కు ఏర్పాట్లు..
విద్యార్థులు బోర్డు పరీక్షకు సిద్ధమయ్యే పరిధిలో వారు ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కోకుండా ఉండేలా అన్నీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మార్చిలో జరిగే పరీక్షలకు ఇప్పటినుంచే ఏర్పాట్లు ప్రారంభించాలని కోరారు. సన్నద్ధమవుతున్న సమయంలో విద్యార్థులకు ఎలాంటి లోటు లేకుండా ఉండేలా చర్యలు చేపట్టాలి. ఈ క్రమంలోనే విద్యార్థులకు సాయంత్రం వేళ స్నాక్స్ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఇటీవలె ఆదేశాలు జారీ చేసింది.
కాగా, మార్చి మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకూ టెన్త్ పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు జరుగుతాయన్న విషయం తెలిసిందే.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Tenth Students
- Telangana Government
- Good News For Students
- tenth students exams preparations
- telangana government good news
- evening snacks
- exam preparation tips for tenth students
- Tenth Exams 2025
- students health and education
- School Education Department
- District Education Officer
- march 2025
- tenth board exams preparations
- tenth public exams preparation tips
- Education News
- Sakshi Education News
- TelanganaEducation
- BoardExams2025