Skip to main content

Lack of Teachers : మూడు రోజుల నుంచి టీచ‌ర్ల కొర‌త‌.. అధికారులు స్పందించాల‌ని డిమాండ్..

కడ్తాల్ మండలంలోని బాలాజీ నగర్ తండా ప్రాథమిక పాఠశాలలో గత మూడు రోజులుగా ప‌రిస్థితి ఇలాగే ఉంది.
No teachers in primary school for three days

సాక్షి ఎడ్యుకేష‌న్: పాఠ‌శాల‌ల్లో విద్యార్థుల‌కు బోధ‌న అందించేది ఉపాధ్యాయులు వారే లేప‌కోతే విద్యార్థులు ఎలా నేర్చుకుంటారు..? ఒక‌రోజు లేక‌పోతే విద్యార్థుల సంద‌డి చేస్తారు. కాని, రెండు రోజుల‌కు మించి ఉపాధ్యాయులు బ‌డుల‌కు రాక‌పోతే విద్యార్థులు ఏమ‌వుతారు. చ‌దువులేక, ఉపాధ్యాయుల బోధ‌న లేక, క్లాస్ రూముల్లో విద్యార్థులు మాత్ర‌మే ఉండి ఏమి ఉప‌యోగం అంటూ ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్నారు గ్రామ‌స్తులు, కడ్తాల్ బిజెపి మండల అధ్యక్షులు మహేష్.

కడ్తాల్ మండలంలోని బాలాజీ నగర్ తండా ప్రాథమిక పాఠశాలలో గత మూడు రోజులుగా ప‌రిస్థితి ఇలాగే ఉంది. అక్క‌డికి ప్ర‌తీ విద్యార్థి వ‌స్తారు. కాని, ఉపాధ్యాయులే గ‌త మూడు రోజులుగా ఊసులేదు. ఇలా అయితే, విద్యార్థులు ఏమవుతారు..!

Graduated Students : డిగ్రీ ఫైన‌ల్ ఇయ‌ర్ విద్యార్థులు కూడా ఈ ప‌రీక్ష‌కు అర్హులు..

వారే టీచ‌ర్లుగా..

గ్రామంలోని ప్రాథ‌మిక పాఠ‌శాల‌లో గ‌త 3 రోజులుగా అధ్యాప‌కులు రాక‌పోవ‌డంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. చేసేదేమి లేక విద్యార్థులు అధ్యాప‌కులు వారే అయ్యి తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. గత మూడు రోజులుగా ఉపాధ్యాయులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, అధికార నిర్లక్ష్యం వల్ల ఇలా జరుగుతుందా, లేదా గిరిజన తండాల విద్యార్థులపై చిన్న చూపు చూస్తున్నారా అని ప్రశ్నించారు బిజెపి మండల అధ్యక్షులు మహేష్.

అధికారులు స్పందించాలి..

విద్యార్థులు పడుతున్న ఇబ్బందుల‌పై అధికారులు తక్షణమే స్పందించాల‌ని, ప్ర‌తీ ఉపాధ్యాయులు త‌మ విధుల్లోకి చేరుకోవాల‌ని, లేదా మ‌రో ఉపాధ్యాయుల‌ని ఏర్పాటు చేయాలని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు మాల శ్రీశైలం గౌడ్, నాయకులు, మాన్యా నాయక్, రాందాస్ నాయక్, కళ్యాణ్ నాయక్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

ఒకే విద్యార్థి.. ఒకే ఉపాధ్యాయిని .. ఇదీ పరిస్థితి!

ఎంఈఓ సత్యనారాయణ ఈ విష‌యంపై స్పందిస్తూ.. స్పోస్ ట్రాన్స్ఫర్‌పై ఈ పాఠ‌శాల‌లోని ఉపాధ్యాయులు బదిలీ అయ్యారని వివ‌రించారు. ఇక‌ ఈ సమాచారం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి తక్ష‌ణ‌మే ఈ విష‌యంపై చ‌ర్చించి, త్వరలోనే విద్యార్థుల‌కు ఉపాధ్యాయుల‌ని ఏర్పాటు చేస్తామని వివ‌రించారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 30 Jan 2025 08:30AM

Photo Stories