National Games 2025: ముగిసిన 38వ జాతీయ క్రీడలు

తదుపరి జాతీయ క్రీడలు(39వ నేషనల్ గేమ్స్) 2027లో మేఘాలయాలో జరుగుతాయి. ఫిబ్రవరి 14వ తేదీ మేఘాలయ ముఖ్యమంత్రి కొంగ్‌కల్ సంగ్మా క్రీడాజ్యోతి అందుకోవడంతో దీనికి సంబంధించిన లాంఛన ప్రకియ కూడా ముగిసింది. 18 రోజుల పాటు విజయవంతంగా నిర్వహించిన తాజా జాతీయ క్రీడల్లో సర్వీసెస్ 121 పతకాలతో ఓవరాల్ చాంపియన్‌షిప్ గెలుచుకుంది.
సర్వీసెస్ క్రీడాకారులు 68 స్వర్ణాలు, 26 రజతాలు, 27 కాంస్యాలు గెలిచారు. మహారాష్ట్ర అత్యధికంగా 198 పతకాలు గెలిచినప్పటికీ పసిడి వేట (54 స్వర్ణాలు)లో వెనుకబడిపోవడంతో రెండో స్థానంలో నిలిచింది. 71 రజతాలు, 73 కాంస్యాలు మరాఠా క్రీడాకారులు చేజిక్కించుకున్నారు.
National Games: జాతీయ క్రీడల్లో తెలంగాణకు రెండు కాంస్యాలు
హరియాణా 153 పతకాలు (48 పసిడి, 47 రజతాలు, 58 కాంస్యాలు) మూడో స్థానంలో నిలువగా, ఆతిథ్య ఉత్తరాఖండ్ 24 స్వర్ణాలు, 35 రజతాలు, 44 కాంస్యాలతో మొత్తం 103 పతకాలు సాధించి ఏడో స్థానంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ (14 పతకాలు) 18వ స్థానంలో, తెలంగాణ (18 పతకాలు) 26వ స్థానంలో నిలిచాయి.
జాతీయ క్రీడల ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విశ్వక్రీడల నిర్వహణకు భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు. 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉన్నారు.
National Games: జాతీయ క్రీడల్లో రెండో స్వర్ణ పతకం సాధించిన ఆంధ్రప్రదేశ్ అథ్లెట్!