National Games: జాతీయ క్రీడల్లో తెలంగాణకు రెండు కాంస్యాలు

నెట్‌బాల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో తెలంగాణ జట్టుకు కాంస్య పతకం దక్కగా.. షూటింగ్ మిక్స్‌డ్ స్కీట్ టీమ్ ఈవెంట్‌లో బత్తుల మునేక్–రష్మీ రాథోడ్ జోడీ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.
నెట్‌బాల్‌లో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ జట్ల మధ్య జరిగిన కాంస్య పతకం మ్యాచ్ 31–31 పాయింట్లతో ‘డ్రా’గా ముగిసింది. దాంతో రెండు జట్లకు కాంస్య పతకాలు ఖరారయ్యాయి.
షూటింగ్ మిక్స్‌డ్ స్కీట్ ఫైనల్లో ఆరు జోడీలు పోటీపడ్డాయి. 138 పాయింట్లతో ఇషాన్ సింగ్–రైజా ధిల్లాన్ (హరియాణా) జంట స్వర్ణం దక్కించుకోగా... భవతేజ్ సింగ్–గనీమత్ సెఖోన్ (పంజాబ్) ద్వయం రజతం సంపాదించింది. 133 పాయింట్లతో మునేక్–రష్మీ జంటకు కాంస్యం లభించింది.
ఫిబ్రవరి 13వ తేదీ పోటీలు ముగిశాక తెలంగాణ 18 పతకాలతో (3 స్వర్ణాలు, 3 రజతాలు, 12 కాంస్యాలు) 26వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ 14 పతకాలతో (7 స్వర్ణాలు, 1 రజతం, 6 కాంస్యాలు) 18వ స్థానంలో కొనసాగుతోంది.
Nishka Agarwal: జాతీయ క్రీడల్లో తెలంగాణ జిమ్నాస్ట్ నిష్కా అగర్వాల్‌కు స్వర్ణం