SpaDeX Satellites: డీ–డాకింగ్ సక్సెస్.. తొలి ప్రయత్నంలోనే సఫలమైన ఇస్రో

మార్చి 12వ తేదీ ఇస్రో స్పేడెక్స్ ఉపగ్రహాలను వేరు చేయడంలో విజయవంతమైంది. ఈ డీ-డాకింగ్ (విడదీత) ప్రక్రియ తొలి ప్రయత్నంలోనే సజావుగా జరిగింది. దీనిని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ‘ఎక్స్’ వేదికపై ప్రకటించారు.
ఈ సాంకేతికత ఇస్రోను అంతరిక్ష రంగంలో మరింత ముందుకు నడిపించింది. ఇస్రో 2024 డిసెంబర్ 30న స్పేడెక్స్ మిషన్ ప్రారంభించి ఛేజర్ (SDX-01), టార్గెట్ (SDX-02) శాటిలైట్లను వేర్వేరు కక్ష్యల్లో ప్రవేశపెట్టింది. వీటి అనుసంధానం (డాకింగ్)ను గత జనవరి 16న విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత, ఇప్పుడు మొదటి ప్రయత్నంలోనే డీ-డాకింగ్‌ను కూడా విజయవంతంగా పూర్తి చేసింది.
Chandrayaan-4: ఇస్రోకు మరో రెండు లాంచ్ ప్యాడ్లు
ఈ విజయంతో ఇస్రో ప్రతిష్టాత్మకమైన డీ-డాకింగ్ సాంకేతికతను అభివృద్ధి చేసి, భవిష్యత్తులో అంతరిక్ష కేంద్రాలు నిర్మించడం, శాటిలైట్లను అనుసంధానం చేయడం వంటి మరిన్ని ప్రయోగాలకు మార్గం సుగమం చేసుకుంది.
మార్చి 13వ తేదీన 45 డిగ్రీల కోణంలో 460 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలో అన్‌డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పరీక్షించిన ఇస్రో తాజాగా ఈ ప్రక్రియను బెంగళూరు, లక్నో, మారిషస్‌లోని గ్రౌండ్ స్టేషన్ల నుంచి నియంత్రిస్తూ పూర్తి చేసింది.
Navratna Status: రెండు ప్రభుత్వ రంగ సంస్థలకు నవరత్న హోదా.. ఆ కంపెనీలు ఇవే!!