NASA: స్ఫియరెక్స్ టెలిస్కోప్ అబ్జర్వేటరీను ప్రయోగించిన నాసా

మార్చి 11వ తేదీన స్ఫియరెక్స్ టెలిస్కోప్ అబ్జర్వేటరీను అంతరిక్షంలోకి ప్రయోగించారు. ఈ టెలిస్కోప్‌తో పాటు మరొక నాలుగు ఉపగ్రహాలను కూడా నాసా అంతరిక్షంలోకి పంపింది. ఈ ఉపగ్రహాలు సూర్యుని ఉపరితల వాతావరణాన్ని అధ్యయనం చేస్తాయి.
స్ఫియరెక్స్ అబ్జర్వేటరీ ద్వారా సేకరించే ఖగోళ సమాచారాన్ని జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్, హబుల్ స్పేస్ టెలిస్కోప్ వంటి టెలిస్కోపుల నిరంతర విశ్లేషణలకు సహాయం అందిస్తుంది. ఈ అబ్జర్వేటరీ, అంతరిక్షం మీద స్పష్టమైన, సమగ్ర చిత్రాలను మనకు అందించే దిశగా కీలకంగా మారనుంది.
SpaDeX Satellites: డీ–డాకింగ్ సక్సెస్.. తొలి ప్రయత్నంలోనే సఫలమైన ఇస్రో
అనంతాకాశం యొక్క మౌలిక ప్రశ్నలకు సమాధానాలు కనుగొనేందుకు స్ఫియరెక్స్ అబ్జర్వేటరీ సహాయపడబోతుంది. దీనిలో, నక్షత్రాల ఉద్భవం, జీవం భూమండలానికి ఎలా వచ్చింది, ఈ విశ్వంలో జీవం భూమి మీద మాత్రమే ఉందా, ఇతర నక్షత్ర మండలాలలో జీవం ఉండే అవకాశం ఉందా? వంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు పరిశోధన ద్వారా కనుగొనబడతాయి.
ఈ అబ్జర్వేటరీ, ఇన్‌ఫ్రారెడ్ కిరణాలు ఉపయోగించి, ఆరు నెలలకొకసారి ఖగోళ పార్శ్వం పై 3D చిత్రాలను తయారుచేస్తుంది. ఈ చిత్రాలను విశ్లేషించడం ద్వారా నక్షత్రాలు, గ్రహాలు, వాటి రసాయనిక నిర్మాణం ఎలా ఉంటుందో, ఖగోళంలో నీటి వనరులు ఉన్నాయా లేదా అన్న విషయాన్ని కూడా సూక్ష్మంగా అధ్యయనం చేయనున్నారు.
Intuitive Machines: చంద్రుడిపై ముగిసిన ల్యాండర్ 'అథెనా' కథ!!