AI Education : ఏఐ విద్యకు 13 సర్కార్ బడుల ఎంపిక.. రేపటి నుంచే..

సాక్షి ఎడ్యుకేషన్: రాష్ట్రంలోని సర్కార్ బడుల్లో నూతన మార్పులను ప్రకటించింది విద్యాశాఖ. సాంకేతికతలో ముందుకు వెళ్తున్న ఈ రోజుల్లో విద్యాలో కూడా మరింత ముందే ఉండే ప్రయత్నంలో భాగమే ఈ మార్పు. రాష్ట్రంలోని ప్రతీ సర్కార్ బడుల్లో విద్యార్థులకు ఏఐ కోర్సును బోధించాలని నిర్ణయించారు అధికారులు. టెక్నాలజీలో దేశమే ముందున్నప్పుడు, విద్యార్థులను కూడా ముందుకు నడిపించాలి. వారికి కూడా పెరుగుతున్న సాంకేతికతపై అవగాహన కల్పించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ 10 మండలాల్లోని 13 ప్రభుత్వ పాఠశాలలను ప్రయోగాత్మకంగా ఎంపిక చేసింది.
ప్రభుత్వ బడుల్లో ఏఐ..
ఈనెల 15వ తేదీ నుంచి కోర్సు బోధనను ప్రారంభిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల పఠనా సామర్థ్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో, ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐని ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.
ఆధునిక సాంకేతికతను ఉపయోగించి విద్యను మరింత ప్రభావవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. నాగర్ కర్నూల్ జిల్లాలోని 10 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ ద్వారా 13 స్కూళ్లలో కోర్సును ప్రారంభించనున్నారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి ఇప్పటికే ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు.
10 మాండలాలు.. 13 సర్కార్ బడులు..
ఇక, ఈ ఏఐ విద్యా ప్రణాళికను మొదట నాగర్ కర్నూల్ జిల్లాలోని 10 మండలాల్లో ఉన్న 13 సర్కార్ బడుల్లో అమలు చేయనున్నారు అధికారులు. బిజినపల్లి మండలంలోని వట్టెం ప్రాథమిక పాఠశాల, చారగొండ మండలంలోని జూపల్లి ప్రాథమిక పాఠశాల, కోడేరు మండలంలోని కొండ్రావుపల్లి ప్రాథమిక పాఠశాల, కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు ప్రాథమిక పాఠశాల, ఎన్మనబెట్ల ప్రాథమిక పాఠశాల, పెద్దకొత్తపల్లి మండలంలోని గండ్రావుపల్లి ప్రాథమిక పాఠశాల, చంద్రకల్ ప్రాథమిక పాఠశాల, పెంట్లవెల్లి మండలంలోని కొండూరు ప్రాథమిక పాఠశాల, తాడూరు మండలంలోని ఐతోల్ ప్రాథమిక పాఠశాల, తెలకపల్లి మండలంలోని ఆలేరు ప్రాథమిక పాఠశాల, తిమ్మాజిపేట మండలంలోని మారేపల్లి ప్రాథమిక పాఠశాల, చేగుంట ప్రాథమిక పాఠశాల, వంగూరు మండలంలోని వంగూర్ ప్రాథమిక పాఠశాలను అధికారులు ఎంపిక చేశారు. ఈ 13 ప్రాథమిక పాఠశాలల్లో 1183 మంది విద్యార్థులు ఒకటో తరగతి నుండి 5వ తరగతి వరకు విద్యను అభ్యసిస్తున్నారు.
Open School Exams Schedule: ఓపెన్ స్కూల్ పరీక్షలు షెడ్యూల్ విడుదల
ఏఐ విద్యకు ఏర్పాట్లు..
విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాలను పెంచేందుకు ప్రారంభిస్తున్న ఏఐ తరగతులను ఏఏ పాఠశాలల్లో ప్రారంభించారో ఆయా పాఠశాలల్లో 5 నుంచి 10 కంప్యూటర్లను సిద్ధం చేశారు. మొత్తం 13 పాఠశాలల్లో 75 కంప్యూటర్లను, హెడ్ ఫోన్స్, ఇంటర్నెట్ సదుపాయంతోపాటు ఇతర అవసరమైన ఎలక్ట్రానిక్ పరికరాలను ఏర్పాట్లు చేశారు. అంతేకాదు, వారి పాఠశాలల్లో ప్రత్యేకంగా కంప్యూటర్ ల్యాబ్‌లను కూడా ఏర్పాటు చేసి ఎడ్యుటెక్ ఆధారిత శిక్షణ అందించనున్నారు అధ్యాపకులు.
మరింత అభివృద్ధి..
ఈ ప్రాజెక్ట్‌తో విద్యార్థులకు తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకునే అవకాశం లభిస్తుంది. ఏఐ టెక్నాలజీ సహాయంతో వారి నేర్చుకునే విధానాన్ని విశ్లేషించి, వారికి తగిన మార్గదర్శకత ఇవ్వనున్నారు. దీనింతో ప్రభుత్వ విద్యార్థులు ప్రైవేట్ విద్యార్థులతో పోటీపడే స్థాయికి చేరుకుంటారని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ, ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే జిల్లావ్యాప్తంగా మరిన్ని స్కూళ్లలో దీన్ని అమలు చేసి మరింత అభివృద్ధి చేసేందుకు సర్కార్ యోచిస్తుంది.
IT Freshers : ఐటీ ఫ్రెషర్లకు గుడ్ న్యూస్.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి భారీ రిక్రూట్‌మెంట్స్..
ఏఐ బోధన విధానం..
సాంకేతిక విద్యను అందించేందుకు ఎంపిక చేసిన పాఠశాలల్లో విద్యార్థులకు ప్రత్యేక సాఫ్టువేర్‌తో ఏఐ బోధన అందించి, ఎంపిక చేసిన 3, 4, 5 తరగతుల వారిని ఐదుగురికి ఒక బ్యాచ్‌గా ఏర్పాటు చేసి, ఒక్కో బ్యాచ్‌కు తెలుగు వాచకం, గణిత అభ్యాసాలపై 20 నిమిషాల వ్యవధిలో ఏఐ పాఠాలను బోధించనున్నామని జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి షర్ఫుద్దీన్ చెప్పారు. ఇక, ఈ పాఠాలను విద్యార్థి అర్థం చేసుకుంటున్నాడా లేదా అని ఏఐ గుర్తిస్తుంది. ఒకవేళ, ఆ విద్యార్థికి చెప్పే పాఠాలు అర్థం కాకపోతే మరోసారి అర్థమైయ్యే రీతిలో బోధిస్తారు. అర్థం అయ్యిందంటే మరికొంత మెరుగైన పద్ధతిలో బోధన అందిస్తూ, విద్యార్థి సులువుగా అర్థం చేసుకునేలా ప్రయత్నాలు చేస్తారు.
జిల్లాలో 13 పాఠశాలలను ఎంపిక చేయగా, ఆయా తరగతుల్లో వెనుకబడిన సీ గ్రేడ్ విద్యార్థులను గుర్తించి, ఆ విద్యార్థులకు ఈకే-స్టెప్ అనే కంపెనీ సహకారంతో ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా ఏఐ బోధన అందిస్తామన్నారు. ఇందుకోసం ఆ పాఠశాలల్లో లేదా పక్కన ఉన్న ఉన్నత పాఠశాలల్లోని కంప్యూటర్లను ఉపయోగించి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విద్యను అందిస్తున్నామని చెప్పారు. ఏదేమైనా, విద్యార్థులకు ఏఐ బోధనను అందించే ప్రయత్నాల్లో, వారికి నాణ్యమైన విద్యను, సాంకేతిక విద్యను అందించే లక్ష్యంవైపు ప్రభుత్వం అడుగులు వేస్తుంది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- AI Education
- Technology Development
- artificial intelligence
- technical education
- School Students
- AI Courses
- Telangana Govt Schools
- ai courses at govt schools
- technical education for govt students
- best technical education with ai courses
- artificial intelligence at tg govt schools
- ai courses for 3rd to 5th class students
- subject wise teaching process in ai classes
- 10 mandals and 13 govt schools
- 13 govt schools for ai education
- ai education for telangana govt school students
- Education News
- Sakshi Education News