Hyderabad University in QR Rankings : బెస్ట్ వర్సిటీల్లో ఒకటిగా అరుదైన విజయం.. హైదరాబాద్ వర్సిటీ ప్రపంచంలోనే బెస్ట్.. క్యూఎస్ ర్యాంకింగ్స్‌లో..

సాక్షి ఎడ్యుకేషన్: హైదరాబాద్ యూనివర్సిటీకి అరుదైన గౌరవం దక్కింది. మరో ఘనతగా ఎడిషన్ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2025లో సబ్జెక్టుల వారీగా హైదరాబాద్ వర్సిటీ ఏడు అధ్యయన అంశాలలో ప్రపంచంలోని అగ్రశ్రేణి వర్సిటీల్లో ఒకటిగా ఎంపికైంది.
18,300 కంటే ఎక్కువే..
మార్చి 12వ తేదీన ఈ ర్యాంకింగ్స్‌ను విడుదల చేశారు. ఇక, ప్రపంచవ్యాప్తంగా ఎన్న 100 ప్రదేశాల్లోని 1,700 విశ్వవిద్యాలయాల్లో 55 విద్యా విభాగాలకు చెందిన విద్యార్థులు తీసుకున్న 18,300 కంటే ఎక్కువ వ్యక్తిగత విశ్వవిద్యాలయ కార్యక్రమాల పనితీరుపై విశ్లేషణతో ఈ ర్యాంకులను ప్రకటించారు. అయితే, హైదరాబాద్ యూనివర్సిటీ ఏడు సబ్జెక్టులలో ర్యాంక్ పొందింది.
QS Rankings: ప్రపంచవ్యాప్తంగా.. టాప్ 50 విద్యాసంస్థల్లో 9 భారతదేశానివే.. ఆ విద్యాలయాలు ఇవే..
7 సబ్జెక్టుల్లో.. గర్వకారణం..
ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ (251-300), లింగ్విస్టిక్స్ (301-350), సోషియాలజీ (301-375), కెమిస్ట్రీ (451-500), ఎకనామిక్స్ అండ్ ఎకనామెట్రిక్స్ (501-550), ఫిజిక్స్ అండ్ ఆస్ట్రానమీ (601-675), బయోలాజికల్ సైన్సెస్ (651-700).. ఇలా ఏడు సబ్జెక్టులలో ర్యాంక్స్ సొంతం చేసుకుంది హైదరాబాద్ యూనివర్సిటీ. ఈ విషయం తెలుసుకున్న వర్సిటీ వైఎస్ ఛాన్సలర్ ఫ్రొఫెసర్ బీజే రావు..
దీనిపై స్పందించి విశ్వవిద్యాలయానికి ఇది గర్వకారణం అని పేర్కొన్నారు. సబ్జెక్టుల వారీగా QS ప్రపంచ ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఉన్నత స్థానంలో ఉండటం చాలా సంతోషంగా ఉందన్నారు.
సంతృప్తి చెందలేదు..
ఈ విజయంతో మేం గర్వపడుతున్నామని తెలిపారు వర్సిటీ వైస్ చాన్సిలర్. ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకున్న విభాగాలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను అన్నారు ఆయన. కానీ, ఈ విజయం, ర్యాంకింగ్‌లతో సంతృప్తి చెందలేదని, మరిన్ని విషయాలను కూడా అందుకోవాలని, వాటిని అందుకునేందుకు ఈ ర్యాంకింగ్స్ ఒక ప్రోత్సాహంగా ఉంటుందని, దీనిని తమ ఉనికిని విస్తరించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. ఇక, దాని కోసం అవిశ్రాంతంగా పనిచేయడానికి కట్టుబడి ఉన్నామని వర్సిటీ వీసీ తెలిపారు.
టాప్ 50లో ఈ వర్సిటీలు..
ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ (ISM), ధన్‌బాద్: మినరల్, మైనింగ్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రపంచంలో 20వ స్థానం.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) బాంబే: మినరల్, మైనింగ్, ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ విభాగాలలో 28వ స్థానం.
IIT ఖరగ్‌పూర్: మినరల్, మైనింగ్, ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ విభాగంలో 45వ స్థానం.
IIM అహ్మదాబాద్: బిజినెస్, మేనేజ్‌మెంట్ విభాగంలో 27వ స్థానం.
IIM బెంగళూరు: బిజినెస్, మేనేజ్‌మెంట్ విభాగంలో 40వ స్థానం.
IIT మద్రాస్: పెట్రోలియం ఇంజినీరింగ్ విభాగంలో ప్రపంచ 50వ స్థానం.
జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU): డెవలప్‌మెంట్ స్టడీస్ విభాగంలో ప్రపంచ 50వ స్థానం.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- qr rankings
- Top Universities
- world's best universities
- Hyderabad University
- top 50 universities in world
- Edition QS World University Rankings 2025
- best universities subject wise
- Best Universities in the World
- IIT Madras
- IIM Banglore and Ahmedabad
- business and engineering unversities
- HU VC BJ Rao
- Hyderabad University in Top Universities in World
- subject wise best universities in the world
- best and higher education
- iit and iim universities in the world
- Jawaharlal Nehru University
- Education News
- Sakshi Education News