Treat Employees As Humans Says Narayana Murthy: "జీతాల తేడాలొద్దు.. ఉద్యోగులను మనుషుల్లా చూడండి".. నారాయణ మూర్తి కామెంట్స్ వైరల్
Sakshi Education
ఉద్యోగుల మధ్య జీతాల ( salaries ) తేడాల్లేకుండా వారిని మనుషుల్లాగా చూడాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి (Infosys founder Narayana Murthy)అన్నారు. ‘టై కాన్ ముంబై 2025’ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, కారుణ్య పెట్టుబడిదారీ విధానం (Compassionate Capitalism) ద్వారా తక్కువ, ఎక్కువ అనే వేతన వ్యత్యాసాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
Treat Employees As Humans Says Narayana Murthy News In Telugu
ప్రతి కార్పొరేట్ ఉద్యోగి గౌరవాన్ని, హుందాతనాన్ని నిలబెట్టాల్సి ఉందని, ఇందుకోసం ‘ఉద్యోగులను ప్రశంసించేటప్పుడు బహిరంగంగా, వారి లోపాలను చెప్పాల్సినప్పుడు ఏకాంతంగా చెప్పాలి. సాధ్యమైనంత వరకు సంస్థ ఫలాలను కంపెనీ ఉద్యోగులందరికీ న్యాయంగా పంచాలి’ అని నారాయణమూర్తి సూచించారు.
దేశంలోని వ్యాపార సంస్థలు, పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారీ విధానాన్ని కరుణతో స్వీకరించినప్పుడే భవిష్యత్ భారత అభివృద్ధి, పేదరిక నిర్మూలన జరుగుతుందని ఆయన అన్నారు. దేశాన్ని గ్లోబల్ లీడర్ గా తీర్చిదిద్దేందుకు భారత్ లోని యువత కృషి చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన మూర్తి గతంలో వారానికి 70 గంటల పనిపై చేసిన వ్యాఖ్యలపై విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.