Sudha Murty Takes Oath As Rajya Sabha MP: రాజ్యసభ ఎంపీగా 'సుధామూర్తి' ప్రమాణ స్వీకారం
ఇంజనీర్ నుంచి పరోపకారిగా మారి ఎంతోమందికి సహాయం చేస్తున్న'సుధామూర్తి' ఈ రోజు తన భర్త ఎన్ఆర్ నారాయణ మూర్తి సమక్షంలో రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ హౌస్‌లోని తన ఛాంబర్‌లో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో పీయూష్ గోయల్ కూడా పాల్గొన్నారు.
ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ చైర్‌పర్సన్, రచయిత్రి సుధామూర్తి పిల్లల కోసం అనేక పుస్తకాలను రచించింది. కన్నడ, ఇంగ్లీష్ సాహిత్యానికి ఆమె చేసిన కృషికి సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారంలభించింది. అంతే కాకుండా ఈమెను 2006లో పద్మశ్రీ, 2023లో పద్మ భూషణ్ అవార్డులు వరించాయి.
గత శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు. TELCOతో పనిచేసిన మొదటి మహిళా ఇంజనీర్ అయిన సుధామూర్తి.. నేడు వేలకోట్ల సామ్రాజ్యంగా మారిన ఇన్ఫోసిస్ ప్రారంభానికి ప్రధాన కారకురాలు కూడా.
#WATCH | Author and philanthropist Sudha Murty, nominated to the Rajya Sabha by President Droupadi Murmu, takes oath as a member of the Upper House of Parliament, in the presence of House Chairman Jagdeep Dhankhar
— ANI (@ANI) March 14, 2024
Infosys founder Narayan Murty and Union Minister Piyush Goyal… pic.twitter.com/vN8wqXCleB