Skip to main content

AI Impact : ఏఐ అభివృద్ధిపై నారాయ‌ణ మూర్తి అభిప్రాయాలు..!!

ఏఐ కార‌ణంగా కొంతమేరకు నిరుద్యోగం పెరుగుతోందని నారాయణమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు.
Deep impact of artificial intelligence on employees and jobs

సాక్షి ఎడ్యుకేష‌న్: ఉద్యోగ కోతలపై కృత్రిమ మేధ (ఆర్టిఫీషియ‌ల్ ఇంటెలిజెన్స్‌.. ఏఐ), వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల ప్రభావం ఎలా ఉంది అనే విష‌యంపై ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి తన అభిప్రాయాలు పంచుకున్నారు. ఏఐ కార‌ణంగా కొంతమేరకు నిరుద్యోగం పెరుగుతోందని నారాయణమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవ‌ల‌, ఓ మీడియా సంస్థ ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఐ ప్రభావంపై జరిగిన చర్చలో ఆయన పాల్గొని త‌న అభిప్రాయాల‌ను వెల్ల‌డించారు. ఏఐను ముప్పుగా కాకుండా ఒక అవకాశంగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంద‌ని ఆయన నొక్కి చెప్పారు.

Job Opening for Freshers: నిరుద్యోగుల కోసం జాబ్‌మేళా.. నెలకు రూ. 25,000 జీతం

కృత్రిమ మేధ-ఉద్యోగ నష్టాలు

వాస్తవానికి ఏఐ చాలా పనులను ఆటోమేట్ చేస్తోందని పేర్కొన్నారు నారాయ‌ణ మూర్తి. ఈ కార‌ణంతో చాలామంది త‌మ ఉద్యోగాలు కోల్పోవాల్సిన ప‌రిస్థితి ఏర్పడింద‌న్నారు. అయితే ఇది కొత్త అవకాశాలను సృష్టించడానికి, మానవ ఉత్పాదకతను పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉందని అంగీకరించారు. 1970ల్లో కంప్యూటర్-ఎయిడెడ్ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్ సాధనాలను ప్రవేశపెట్టిన సమయంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయ‌ని చెప్పుకొచ్చారు.

First AI University In India : భార‌తదేశంలో మొట్ట‌మొద‌టి ఏఐ వర్సిటీ ఏర్పాటు.. ఎక్క‌డంటే...?

కానీ ఈ సాధనాలు డెవలపర్లకు మరింత క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి వీలు కల్పించాయని, ఉత్పాదకతను పెంచడానికి మానవులు, యంత్రాలు కలిసి పనిచేసే సహాయక సాంకేతికతగా కృత్రిమ మేధను పరిగణించాలని మూర్తి అన్నారు. అటానమస్ డ్రైవింగ్, ప్రమాదకర వాతావరణంలో యంత్రాలను ఆపరేట్ చేయడం, కచ్చితమైన పరికరాలతో రిమోట్ సర్జరీ వంటి వాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రయోజనకరంగా ఉంటుందనే విష‌యాన్ని హైలైట్ చేశారు. కృత్రిమ మేధను ఉపయోగించడం ద్వారా మానవులు మరింత సృజనాత్మక, సంక్లిష్టమైన పనులపై దృష్టి పెట్టవచ్చని చెప్పారు. ఇది ఉద్యోగుల నైపుణ్యాల పెరుగుదలకు దారితీస్తుందని తెలిపారు.

AI Based Teaching: ప్రభుత్వ స్కూళ్లలో ఏఐ ఆధారిత బోధన.. ఈ తరగతి నుంచి!

ఏఐ ఇన్నోవేషన్‌లో భారత్ పాత్ర

కృత్రిమ మేధ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, నూతన ఆవిష్కరణలు చేయడంలో భారత్ సామర్థ్యంపై మూర్తి త‌న‌ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇతర ప్రాంతాల్లో అభివృద్ధి చెందిన సాంకేతికతలను అవలంబించడమే కాకుండా ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగానికి దోహదపడే స్థాయికి దేశం పురోగమించిందని అభిప్రాయపడ్డారు. కృత్రిమ మేధను స్వీకరించి కొత్త టెక్నాలజీల్లో పెట్టుబడులు పెట్టాలని యువతను కోరారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 07 Feb 2025 10:05AM

Photo Stories