Skip to main content

First AI University In India : భార‌తదేశంలో మొట్ట‌మొద‌టి ఏఐ వర్సిటీ ఏర్పాటు.. ఎక్క‌డంటే...?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఇప్పుడున్న టెక్నాల‌జీ రంగంలో... ఎక్కువ‌గా విన్పించే పేరు ఏఐ (ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌). ఈ కోర్సుకు కూడా ప్ర‌స్తుతం చాలా డిమాండ్ ఉంది. ఈ నేప‌థ్యంలో.. భార‌త‌దేశంలో తొలి ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) యూనివర్సిటీ మహారాష్ట్రలో ఏర్పాటు చేయ‌నున్నారు.
Artificial Intelligence University to be established in Maharashtra with government support  First AI University In India   Maharashtra State IT Minister Ashish Shelar announces the establishment of Indias first AI University

వివిధ రంగాల నిపుణులతో ఓ టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ ఏర్పాటైనట్టు మహారాష్ట్ర రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ఆశిష్‌ షేలర్‌ వెల్లడించారు. 

➤☛ No Extra School Fees : ఇక‌పై ప్రైవేట్ స్కూల్స్‌లో ఇలాంటి ఫీజులు వసూలు చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు... ఇంకా...!

మహారాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో... ఏర్పాటైన ఈ కమిటీలో ఐఐటీ ముంబై, ఐఐఎం ముంబై డైరెక్టర్లు, గూగుల్‌ ఇండియా, మహీంద్రా గ్రూప్‌, ఎల్‌అండ్‌టీ లాంటి దిగ్గజ సంస్థల ప్రతినిధులు, కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ అధికారులు, రాజీవ్‌ గాంధీ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కమిషన్‌, డాటా సెక్యూరిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నిపుణులు సభ్యులుగా ఉన్నట్టు తెలిపారు.

Published date : 04 Feb 2025 08:57AM

Photo Stories