Inauguration Ceremony: ఎకో ఫ్రెండ్ల్రీ వాహనంతో పాటు ఏయూలో హాస్టల్ల ప్రారంభోత్సవం
సాక్షి ఎడ్యుకేషన్: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నాడు– నేడు పనుల్లో భాగంగా ఆధునీకరించిన శ్రీకృష్ణదేవరాయ వసతి గృహం (ఎస్‌కేడీ హాస్టల్)ను వైఎస్సార్‌సీపీ రీజినల్ కోఆర్డినేటర్ వై.వి.సుబ్బారెడ్డి ప్రారంభించారు. నాడు– నేడు పనుల్లో భాగంగా ఈ హాస్టల్‌లో 240 గదులను ఆధునీకరించినట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. మంచినీటి సౌకర్యం, విద్యుత్, టాయిట్ సౌకర్యాలను ఆధునికంగా తీర్చిదిద్దారు.
AP Students Visits white house: వైట్ హౌస్‌లో ఏపీ విద్యా ప్రభ
ఈ కార్యక్రమం అనంతరం సుబ్బారెడ్డి ఆదిత్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ (ఐతం) విద్యార్థులు రూపొందించిన ఎకో ఫ్రెండ్లీ వాహనాన్ని ప్రారంభించారు. ఐతం విద్యార్థులు రూపొందించిన ఈ ఇంధన రహిత వాహనాన్ని ఆ కళాశాల యాజమాన్యం ఏయూకు అందజేసింది. వివిధ అవసరాల నిమిత్తం వర్సిటీని సందర్శించే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కోసం దీన్ని ఉపయోగించనున్నారు. పర్యావరణ హితమైన ఇలాంటి వాహనాలను మరిన్ని అందుబాటులోకి తేవాలని వైవీ సుబ్బారెడ్డి సూచించారు.